ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

DK Shivkumar: అయోధ్యకు వెళ్లడంపై తేల్చిచెప్పిన డీకే

ABN, Publish Date - Jan 07 , 2024 | 03:28 PM

అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవానికి వెళ్లే విషయంలో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పష్టత ఇచ్చారు. ఈనెల 22న జరిగే రామ్‌లల్లా ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి తనకు కానీ, ముఖ్యమంత్రికి కానీ ఇంతవరకూ ఆహ్వానం రాలేదని చెప్పారు.

బెంగళూరు: అయోధ్యలో రామాలయ (Ayodhya Ram temple) ప్రారంభోత్సవానికి వెళ్లే విషయంలో కర్ణాటక (Karnataka) ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (DK Shivakumar) స్పష్టత ఇచ్చారు. ఈనెల 22న జరిగే రామ్‌లల్లా ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి తనకు కానీ, ముఖ్యమంత్రికి కానీ ఇంతవరకూ ఆహ్వానం రాలేదని చెప్పారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ వెళ్తుందా లేదా అనేది పార్టీనే నిర్ణయిస్తుందని చెప్పారు.


"నన్ను ఆహ్వానించలేదు. మన సీఎంను కూడా పిలువలేదు. మా పార్టీ అధ్యక్షుడిని (ఖర్గే) ఆహ్వానించినట్టు చూశాను. దీనిపై పార్టీ నిర్ణయం తీసుకుంటుంది'' అని డీకే తెలిపారు. తాను రాముడు, హనుమంతుడిన భక్తుడినని చెప్పారు. రాముడు అందరి హృదయాల్లోనూ ఉంటారని, ఇక్కడి నుంచే ప్రార్థించుకోవచ్చని, ఆ విషయాన్ని ఎవరూ రాజకీయం చేయరాదని హితవు పలికారు.


సోనియా, ఖర్గేకు ఆహ్వానం

పార్టీ విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, కాంగ్రెస్ పార్టమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియాగాంధీ, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు 22న అయోధ్యలో జరిగే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ఆహ్వానం అందింది. ఈ ఇరువురూ హాజరవుతారా లేదా అనేది మాత్రం పార్టీ ఇంకా ప్రకటించలేదు. అయోధ్య కార్యక్రమానికి ఆహ్వానం అందిన వారిలో బీహార్ సీఎం నితీష్ కుమార్, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తదితరులు ఉన్నారు. సీపీఎం ఇప్పటికే ఆ ఆహ్వానాన్ని తోసిపుచ్చగా, నితీష్ కుమార్ ఇంకా తన నిర్ణయాన్ని ప్రకటించలేదు.

Updated Date - Jan 07 , 2024 | 03:28 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising