ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

United Nations: యూఎన్‌లో శాశ్వత ప్రతినిధిగా హరీశ్ పర్వతనేని నియామకం

ABN, Publish Date - Aug 14 , 2024 | 06:20 PM

న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధిగా హరీశ్ పర్వతనేని నియమితులయ్యారు. ఈ మేరకు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ బుధవారం ప్రకటించింది. ఇప్పటి వరకు ఈ పదవిలో ఉన్న రుచిరా కాంబోజ్ జూన్‌లో రిటైరయ్యారని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆ పదవిలో హరీశ్ పర్వతనేని నియామకం అనివార్యమైందని స్పష్టం చేసింది.

Parvathaneni Harish

న్యూఢిల్లీ, ఆగస్ట్ 14: న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధిగా హరీశ్ పర్వతనేని నియమితులయ్యారు. ఈ మేరకు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ బుధవారం ప్రకటించింది. ఇప్పటి వరకు ఈ పదవిలో ఉన్న రుచిరా కాంబోజ్ జూన్‌లో రిటైరయ్యారని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆ పదవిలో హరీశ్ పర్వతనేని నియామకం అనివార్యమైందని స్పష్టం చేసింది. మరికొద్ది రోజుల్లో ఆయన తన పదవి బాధ్యతలు చేపడతారని వివరించింది.

Also Read: Air India Flight : బయలుదేరిన కొద్దిసేపటికే విమానంలో సాంకేతిక సమస్య..


ప్రస్తుతం జర్మనీలో భారత రాయబారీగా..

ప్రస్తుతం హరీశ్ పర్వతనేని జర్మనీలో భారత రాయబారీగా విధులు నిర్వహిస్తున్నారని తెలిపింది. 1990, ఇండియన్ ఫారెన్ సర్వీస్ అధికారి హరీశ్ పర్వతనేని. 2021, నవంబర్ 6న జర్మనీలో భారత రాయబారీగా ఆయన నియమితులయ్యారు. అంతకుముందు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో ఆర్థిక సంబంధాల విభాగంలో అదనపు కార్యదర్శిగా విధులు నిర్వహించారు. గత మూడు దశాబ్దాల పాటు పలు ద్వైపాక్షిక ఆర్థిక వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించారు. అలాగే జీ 20, జీ 7, బ్రిక్స్, ఐబీఎస్ఏ‌లో సైతం ఆయన ముఖ్య భూమిక పోషించారు. తూర్పు ఆసియాతోపాటు విదేశీ ప్రచార విభాగాల్లో కూడా పని చేశారు.

Also Read: Rachakonda CP: రియాజ్‌ను హత్య చేస్తే.. డాన్ అవుతాడనుకున్న హమీద్


భారత ఉప రాష్ట్రపతికి ఓఎస్డీగా.. ఉస్మానియా నుంచి ఇంజినీరింగ్ పట్టా...

బారత ఉప రాష్ట్రపతికి ఓఎస్‌డీగా, సంయుక్త కార్యదర్శిగా కూడా వ్యవహరించారు. వివిధ దేశాల్లోని భారత రాయబార కార్యాలయంలో సైతం ఆయన వివిధ హోదాల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ ఇంజినీరింగ్‌ కాలేజీ నుంచి మెకానికల్ ఇంజినీరింగ్‌ విభాగంగా హరీశ్ పర్వతనేని గోల్డ్ మెడల్ అందుకున్నారు. అనంతరం కోల్‌కతాలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో ఉన్నత విద్యను అభ్యసించారు. పర్వతనేని నందితను హరీశ్ వివాహం చేసుకున్నారు.

Also Read: Kolkata RG Kar Hospital: ట్రైయినీ వైద్యురాలి పోస్ట్‌మార్టం నివేదికలో సంచలన విషయాలు


యూఎన్‌లో తొలి భారతీయురాలిగా..

యునైటెడ్ నేషన్స్‌లో భారత శాశ్వత ప్రతినిధిగా పని చేసిన రుచిర కాంబోజ్.. ఈ ఏడాది జూన్ 1వ తేదీన రిటైరయ్యారు. ఆ పదవిని చేపట్టిన తొలి భారతీయురాలిగా ఆమె ఖ్యాతిని ఆర్జించారు. 1987లో సివిల్స్‌లో టాపర్‌గా రుచిర కాంబోజ్ నిలిచారు. ఉద్యోగ పదవి విరమణ వేళ.. ఎక్స్ వేదికగా స్పందించిన సంగతి తెలిసిందే.

Also Read: Jammu Kashmir Encounter: ఆర్మీ అధికారి మృతి, నలుగురు ఉగ్రవాదులు హతం..!

Read More National News and Latest Telugu News

Updated Date - Aug 14 , 2024 | 07:06 PM

Advertising
Advertising
<