ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Delhi: పేటీఎంకు మరో షాక్.. రూ.5.49 కోట్ల జరిమానా విధించిన కేంద్రం

ABN, Publish Date - Mar 01 , 2024 | 07:50 PM

ఆర్బీఐ నిషేధం తరువాత పేటీఎం పేమెంట్స్‌కు (Paytm) మరో షాక్ తగలింది. ఫిన్‌టెక్ దిగ్గజ కంపెనీ అయిన పేటీఎం పేమెంట్స్‌కు కేంద్ర ఆర్థిక శాఖ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ - ఇండియా(FIU-IND) భారీ జరిమానా విధించింది. పేటీఎం మనీలాండరింగ్‌కు పాల్పడిందనే కారణంతో జరిమానా విధించినట్లు కేంద్రం తెలిపింది.

ఢిల్లీ: ఆర్బీఐ నిషేధం తరువాత పేటీఎం పేమెంట్స్‌కు (Paytm) మరో షాక్ తగలింది. ఫిన్‌టెక్ దిగ్గజ కంపెనీ అయిన పేటీఎం పేమెంట్స్‌కు కేంద్ర ఆర్థిక శాఖ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ - ఇండియా(FIU-IND) భారీ జరిమానా విధించింది. పేటీఎం మనీలాండరింగ్‌కు పాల్పడిందనే కారణంతో జరిమానా విధించినట్లు కేంద్రం తెలిపింది. ఇందుకుగానూ రూ.5.49 కోట్ల ఫైన్ విధించినట్లు చెప్పింది.

మార్చి 1న కేంద్ర ఆర్థిక శాక విడుదల చేసిన ప్రకటనలో.. "పేటీఎం ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ విభాగానికి ఆన్‌లైన్‌లో లావాదేవీలు, లావాదేవీలను సులభతరం చేయడంతో సహా కొన్ని సంస్థలు చట్ట విరుద్దంగా వ్యాపార కార్యకాలాపాలు చేస్తున్నాయంటూ పలు ప్రభుత్వ ఏజెన్సీల నుండి సమాచారం వచ్చింది. దీంతో పేటీఎం బ్యాంక్‌ లావాదేవీలపై ఫోకస్ పెంచాం. తాము చేసిన విచారణలో పీపీబీఎల్‌ మనీలాండరింగ్‌కు పాల్పడ్డట్లు తేలింది. అక్రమంగా సంపాదించిన డబ్బును పేటీఎం ద్వారా ఇతర బ్యాంక్ అకౌంట్లకు మళ్లించినట్లు గుర్తించాం" అని ఆ ప్రకటనలో వెల్లడించింది. ఆర్బీఐ ఆంక్షలతో ఇప్పటికే సతమతమవుతున్న పేటీఎం తాజా పరిణామంతో కంగుతింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 01 , 2024 | 07:51 PM

Advertising
Advertising