పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగాన్ని నోటిఫై చేసిన కేంద్రం
ABN, Publish Date - Mar 21 , 2024 | 06:00 AM
ఆన్‌లైన్‌లో ఉన్న సమాచారాన్ని తనిఖీ చేసి అవి నిజమో కాదో చెప్పేందుకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ప్రారంభించిన ‘ఫ్యాక్ట్ చెక్ (నిజనిర్ధారణ)’ విభాగాన్ని కేంద్ర ఐటీ శాఖ బుధవారం నోటిఫై చేసింది. తప్పుడు వార్తలు
న్యూఢిల్లీ, మార్చి 20: ఆన్‌లైన్‌లో ఉన్న సమాచారాన్ని తనిఖీ చేసి అవి నిజమో కాదో చెప్పేందుకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ప్రారంభించిన ‘ఫ్యాక్ట్ చెక్ (నిజనిర్ధారణ)’ విభాగాన్ని కేంద్ర ఐటీ శాఖ బుధవారం నోటిఫై చేసింది. తప్పుడు వార్తలు ప్రచురించినా, ప్రసారం చేసినా వాటిని తొలగించాలంటూ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌కు, ఇంటర్‌నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు, ఇతర సర్వీస్ ప్రొవైడర్లకు ఆదేశాలు జారీ చేసే అధికారం ఈ విభాగానికి ఉంటుంది. అయితే.. పీఐబీ ఇలా ఫ్యాక్ట్ చెక్ యూనిట్‌ను ఏర్పాటు చేయడం భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు విఘాతం కలిగించడమేనని ‘ద ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ’ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ఫ్యాక్ట్‌చెక్ విభాగాన్ని నోటిఫై చేయకుండా ఆదేశాలివ్వాలంటూ ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై సుప్రీంకోర్టు గురువారం విచారణ జరపనుంది. ఇంతలోనే కేంద్రం.. పీఐబీ ఫ్యాక్ట్‌చెక్ విభాగాన్ని నోటిఫై చేయడం గమనార్హం.
Updated Date - Mar 21 , 2024 | 08:06 AM