ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

PM Modi:మోదీ ఎమోషనల్.. తెలుగు వ్యక్తిపై ప్రశంసలు..

ABN, Publish Date - Sep 29 , 2024 | 01:25 PM

న్ కీ బాత్ 114వ ఎపిసోడ్‌లో దేశ ప్రజలను ఉద్దేశించి మోదీ మాట్లాడారు. స్వదేశంలో తయారీ పరిశ్రమను ప్రోత్సహించడం ద్వారా దేశంలోని పెద్ద పరిశ్రమలతో పాటు చిన్న దుకాణదారుల సహకారంతో ప్రతి రంగానికి ప్రయోజనం చేకూరుతుందని, ఎగుమతులు పెరగడంతో పాటు విదేశీ ..

PM Modi

మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంతో తయారీ రంగంలో భారత్ పవర్‌హౌస్‌గా మారిందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పేద, మధ్య తరగతి ప్రజలతో పాటు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు మేక్ ఇన్ ఇండియాతో ఎంతో ప్రయోజనం పొందుతున్నారని.. తమ నైపుణ్యాలను, ప్రతిభను ప్రదర్శించడానికి మేకిన్ ఇండియా చక్కటి వేదికగా నిలుస్తుందన్నారు. మన్ కీ బాత్ 114వ ఎపిసోడ్‌లో దేశ ప్రజలను ఉద్దేశించి మోదీ మాట్లాడారు. స్వదేశంలో తయారీ పరిశ్రమను ప్రోత్సహించడం ద్వారా దేశంలోని పెద్ద పరిశ్రమలతో పాటు చిన్న దుకాణదారుల సహకారంతో ప్రతి రంగానికి ప్రయోజనం చేకూరుతుందని, ఎగుమతులు పెరగడంతో పాటు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించడానికి మేకిన్ ఇండియా కార్యక్రమం దోహదపడుతుందని మోదీ తెలిపారు. ప్రస్తుతం ఉత్పత్తుల నాణ్యతపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందని, లోకల్ టు వోకల్‌కు ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు. మహారాష్ట్రలోని భండారా జిల్లాను ఉదాహరణగా చెబుతూ.. మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తిని ప్రతిబింబించేలా టస్సార్ సిల్క్‌ను సంరక్షించేందుకు 50కి పైగా స్వయం సహాయక బృందాలు పనిచేస్తున్నాయని మోదీ తెలిపారు. రానున్న పండుగల సీజన్‌లో మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులను కొనుగోలు చేయాలని ప్రధాని ప్రజలను కోరారు. కొత్త రంగాల ఆవిర్భావంతో ఉద్యోగాల స్వభావాలు మారుతున్నాయని, యువతలో ప్రతిభను, సృజనాత్మకతను పెంపొందించేందుకు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ 'క్రియేట్ ఇన్ ఇండియా' అనే థీమ్‌ కింద 25 సవాళ్లను ప్రారంభించిందని మోదీ తెలిపారు. వెవ్స్ ఇండియా.ఓఆర్‌జీ(wavesindia.org) వెబ్ ‌సైట్‌ను సందర్శించడం ద్వారా దేశంలోని యువత ఈ ఛాలెంజ్‌లో పాల్గొనాలని ప్రధాని కోరారు.

Somireddy: జగన్‌పై సోమిరెడ్డి సంచలన వ్యాఖ్యలు..


స్వచ్ఛ భారత్‌కు పదేళ్లు..

ఈ ఏడాది అక్టోబర్ 2వ తేదీకి స్వచ్ఛ భారత్ కార్యక్రమం పదేళ్లు పూర్తి చేసుకుంటుందని మోదీ తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం విజయవంతంగా ముందుకెళ్తోందన్నారు. వ్యర్థాల నుంచి సంపద సృష్టించే దిశగా స్వచ్ఛ భారత్ కార్యక్రమం రూపుదిద్దుకుందని చెప్పారు. స్వచ్ఛ భారత్ మిషన్‌ను ప్రజా ఉద్యమంగా మార్చిన వారిని మోదీ అభినందించారు. తన జీవితాన్ని స్వచ్ఛతకు అంకితం చేసిన మహాత్మాగాంధీకి మోదీ నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం కోసం ప్రకృతికి ధన్యవాదాలు పేరుతో ఉత్తరాఖండ్‌లోని ఝాలా గ్రామం యువత చూపిన చొరవను ప్రధాని ప్రశంసించారు. పుదుచ్చేరిలోని మహే ప్రాంతంలో బీచ్ చుట్టుపక్కల ప్రాంతాలను శుభ్రం చేసే బృందానికి నాయకత్వం వహించిన మహిళ రమ్యను ప్రధాని అభినందించారు. కేరళలోని కోజికోడ్‌లో నివసిస్తున్న 74 ఏళ్ల సుబ్రమణియన్ 23 వేలకు పైగా కుర్చీలను మరమ్మతులు చేసి వాటిని మళ్లీ ఉపయోగించుకునేలా చేసిన కృషిని ప్రధాని ప్రశంసించారు. పరిశుభ్రత ప్రచారంలో పాల్గొనాలని మోదీ ప్రజలను కోరారు. మెగా ప్లాంటేషన్ డ్రైవ్‌లో భాగంగా ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాలు నిర్దేశించిన లక్ష్యానికి మించి మొక్కలు నాటి సరికొత్త రికార్డు సృష్టించాయని కొనియాడారు.

స్వచ్ఛభారత్‌కు మీరే వెన్నెముక


తెలుగోడిపై ప్రశంసలు..

పర్యావరణ పరిరక్షణ ప్రచారంలో దేశంలోని వేలాది పాఠశాలలకు చెందిన విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది ఎంతో ఉత్సాహంతో పాల్గొంటున్నారని మోదీ చెప్పారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన కేఎన్ రాజ‌శేఖ‌ర్‌ను ఉదాహరణగా చెబుతూ రాజ‌శేఖ‌ర్ 1500కు పైగా మొక్కలు నాటారని.. పర్యావరణ పరిరక్షణకు ఆయన చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. తమిళనాడులోని మధురై నివాసి సుభాశ్రీ అరుదైన, ఉపయోగకరమైన మూలికలతో కూడిన అద్భుతమైన ఉద్యానవనాన్ని రూపొందించినందుకు ఆయన కృషిని ప్రశంసించారు. నీటి సంరక్ష కోసంబుందేల్‌ఖండ్ ప్రాంతంలోని మహిళలు చేస్తున్న కృషిని ప్రశంసించారు. మహిళలు ఇసుకను బస్తాల్లో నింపి చెక్‌డ్యామ్‌ నిర్మించి వర్షపు నీరు వృథాగా పోకుండా అడ్డుకున్నారని తెలిపారు.


ప్రధాన మంత్రి తన మన్ కీ బాత్‌లో ఇటీవల అమెరికా పర్యటనలో సుమారు 300 పురాతన కళాఖండాలను తిరిగి పొందడం గురించి ప్రస్తావించారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ డెలావేర్‌లోని తన ప్రైవేట్ నివాసంలో ఈ కళాఖండాలలో కొన్నింటిని తనకు చూపించారన్నారు. దేశానికి తిరిగి వచ్చిన కళాఖండాలు టెర్రకోట, రాయి, ఏనుగు దంతాలు, కలప, రాగి, కాంస్య వంటి వాటితో తయారుచేసినట్లు తెలిపారు. ఈ కళాఖండాలను రూపొందించిన పూర్వీకులను మోదీ కొనియాడారు. ఈ కళాఖండాల అక్రమ రవాణాను తీవ్రమైన నేరంగా పేర్కొన్న ప్రధాన మంత్రి, ఈ విలువైన కళాఖండాలను తిరిగి పొందేందుకు భారతదేశం అనేక దేశాలతో కలిసి పనిచేస్తోందన్నారు. మాతృభాష ప్రాముఖ్యత తెలియజేస్తూ.. దేశంలో ఇరవై వేల భాషలు, వేలాది మాండలికాలు ఉన్నాయన్నారు. సంతాలీ భాషను పరిరక్షించేందుకు చేస్తున్న కృషిని మోదీ అభినందించారు. డిజిటల్ ఇన్నోవేషన్‌తో సంతాలీకి కొత్త గుర్తింపు తెచ్చేందుకు ప్రచారం ప్రారంభమైందన్నారు. మన్ కీ బాత్ కార్యక్రమం 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నందున తాను భావోద్వేగానికి గురైనట్లు తెలిపారు. పదేళ్ల క్రితం అక్టోబర్ 3న విజయదశమి రోజున మన్ కీ బాత్ ప్రారంభమైందన్నారు. దేశంలోని నలుమూలల నుండి సమాచారాన్ని అందించిన కోట్లాది మంది మన్ కీ బాత్ శ్రోతలు, ఈ ప్రయాణంలో సహకరించిన సహచరులకు మోదీ ధన్యవాదాలు తెలిపారు. మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తున్న టీవీ ఛానెల్స్, ప్రింట్ మీడియా, యూట్యూబర్‌లకు మోదీ ధన్యవాదాలు తెలిపారు. దేశంలోని 22 భాషలతో పాటు 12 విదేశీ భాషల్లో ఈ కార్యక్రమాన్ని వినవచ్చన్నారు. రాబోయే పండుగల సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు.


పకడ్బందీగా పథకాల అమలు

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Latest Telugu News Click Here

Updated Date - Sep 29 , 2024 | 01:25 PM