PM Modi: శ్రీనగర్ పర్యటనకు మోదీ.. ఎందుకంటే
ABN, Publish Date - Jun 12 , 2024 | 04:35 PM
ప్రధాని మోదీ జూన్ 20న జమ్మూకశ్మీర్(Jammu & Kashmir) రాష్ట్రం శ్రీనగర్‌లో పర్యటించనున్నారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం(International Yoga Day 2024) సందర్భంగా మోదీ ఆ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
ఢిల్లీ: ప్రధాని మోదీ జూన్ 20న జమ్మూకశ్మీర్(Jammu & Kashmir) రాష్ట్రం శ్రీనగర్‌లో పర్యటించనున్నారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం(International Yoga Day 2024) సందర్భంగా మోదీ ఆ కార్యక్రమంలో పాల్గొననున్నారు. యోగాను అలవాటుగా మార్చుకోవాలని మోదీ పేర్కొన్నారు.
ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల ప్రజలను యోగా ఏకం చేసిందని అన్నారు. యోగాను తమ జీవితాల్లో చేర్చుకోవాలనే నిబద్ధతను పునరుద్ఘాటించాలని, ఇతరులను కూడా యోగా చేసేలా ప్రేరేపించాలని మోదీ.. దేశ ప్రజలను కోరారు.
మోదీ తన ఎక్స్ అకౌంట్లో.. "ఈ సంవత్సరం యోగా దినోత్సవ తేదీ సమీపిస్తోంది. యోగాను మన జీవితంలో అంతర్భాగంగా మార్చుకోవడానికి, ఇతరులను వారి జీవితంలో భాగం చేసుకునేలా ప్రోత్సహించడానికి తమ నిబద్ధతను పునరుద్ఘాటించడం చాలా అవసరం"అని పోస్ట్ చేశారు.
Updated Date - Jun 12 , 2024 | 04:35 PM