ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

PM Modi: దోచుకున్నది కక్కిస్తాం.. పీఎం పవర్ పంచ్

ABN, Publish Date - Feb 05 , 2024 | 08:25 PM

రాష్ట్రపతి బడ్జెట్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానానికి బదులిస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విపక్షాలపై, ముఖ్యంగా కాంగ్రెస్‌పై నిప్పులు కక్కారు. విపక్ష నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతున్నారంటూ చేస్తున్న ఆరోపణలపై పవర్‌ఫుల్ పంచ్ విసిరారు. ''దేశాన్ని దోచుకున్న వారు మూల్యం చెల్లించాల్సిందే'' అని హెచ్చరించారు.

న్యూఢిల్లీ: రాష్ట్రపతి బడ్జెట్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానానికి బదులిస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) విపక్షాలపై, ముఖ్యంగా కాంగ్రెస్‌పై నిప్పులు కక్కారు. విపక్ష నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతున్నారంటూ చేస్తున్న ఆరోపణలపై పవర్‌ఫుల్ పంచ్ విసిరారు. ''దేశాన్ని దోచుకున్న వారు మూల్యం చెల్లించాల్సిందే'' అని హెచ్చరించారు.


''అవినీతిపై చర్యలు తీసుకోవడం ఏజెన్సీల పని. ఆ పని చేస్తుంటే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పదేళ్ల క్రితం మన పార్లమెంటులో కుంభకోణాలపై చర్చలు జరిగేవి. ప్రతిసారి చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వినిపించేవి. కానీ ఈరోజు అవినీతిపై చర్యలు తీసుకుంటుంటే కొందరు వ్యక్తులు వ్యతిరేకిస్తున్నారు'' అని విపక్షాలకు ప్రధాని చురకలు వేశారు.


మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద గతంలో కంటే ఇప్పుడు రెట్టింపు కేసులు నమోదయ్యాయని, కాంగ్రెస్ హయాంలో ఈడీ జప్తు చేసుకున్న ఆస్తులు రూ.5,000 కోట్లు మాత్రమేనని మోదీ చెప్పారు. అయితే తమ హయాంలో లక్ష కోట్ల రూపాయల ఆస్తులను ఈడీ స్వాధీనం చేసుకుందని అన్నారు. ''మీరు దోచుకున్న సొమ్ము తిరిగి ఇచ్చేయాల్సిందే. దేశాన్ని మోసం చేస్తామంటే నేను చూస్తూ ఊరుకునేది లేదు'' అని అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న విపక్ష నేతలను ఉద్దేశించి ప్రధాని ఘాటు హెచ్చరికలు చేశారు.

Updated Date - Feb 05 , 2024 | 08:36 PM

Advertising
Advertising