ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

PM Modi: నా బెస్ట్ ఫ్రెండ్‌కు విషెస్..మోదీ ట్వీట్

ABN, Publish Date - Nov 06 , 2024 | 02:09 PM

2024 అమెరికా అధ్యక్ష ఎన్నిక‌ల ఫ‌లితాల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించడంపై భారత ప్రధాని మోదీ సోషల్ మీడియాలో స్పందించారు. హృదయపూర్వక అభినందనలు మిత్రమా అంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

modi

PM Modi: 2024 అమెరికా అధ్యక్ష ఎన్నిక‌ల ఫ‌లితాల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించడంపై భారత ప్రధాని మోదీ సోషల్ మీడియాలో స్పందించారు. హృదయపూర్వక అభినందనలు మిత్రమా అంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

'గతంలో మీ హయాంలో జరిగిన అభివృద్ధి పునాదిగా నేడు మీ విజయం సాకారమైంది. భారత్-అమెరికా మధ్య సమగ్ర అంతర్జాతీయ, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడం కోసం, మన సంబంధాలకు పునరుజ్జీవం కల్పించడంపై దృష్టి సారిద్దాం. ఇరు దేశాల ప్రజల జీవితాలను మెరుగుపర్చేందుకు, ప్రపంచశాంతి వికాసానికి, స్థిరత్వానికి, శ్రేయస్సు కోసం కలసికట్టుగా పాటుపడదాం' అంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.


స్నేహబంధం..

భారత ప్రధాని నరేంద్ర మోదీ, ట్రంప్ మధ్య మంచి స్నేహబంధం ఉందన్న సంగతి తెలిసిందే. ‘హౌడీ, మోడీ!’, ‘నమోస్తే మోదీ’ లాంటి కార్యక్రమాల్లో మోదీతో పాటు ట్రంప్ కూడా పాల్గొన్నారు. ట్రంప్ గత పాలనలో భారత్-అమెరికా సంబంధాలు మంచిగానే కొనసాగాయి. మరి ట్రంప్ 2.0 పాలనలో అవకాశాలతో పాటు సవాళ్లు కూడా ఎదురుకావచ్చని విశ్లేషణలు వెలువడుతున్నాయి. అమెరికాకు ప్రధాన వ్యూహాత్మక భాగస్వామి అయిన ఇండియాకు వాణిజ్యం, ఇమ్మిగ్రేషన్, సైనిక సహకారం, దౌత్యం వంటి అంశాల్లో ట్రంప్ తీసుకునే నిర్ణయాలు కీలకంగా మారనున్నాయని తెలుస్తుంది.


Also Read:

ఆంధ్రప్రదేశ్ అల్లుడే అమెరికా ఉపాధ్యక్షుడు..

పడి లేచిన కెరటం.. డొనాల్డ్ ట్రంప్ గురించి ఈ విషయాలు తెలుసా?

అమెరికా ఎన్నికల్లో గెలుపు.. తొలి ప్రసంగం చేసిన డొనాల్డ్ ట్రంప్

For More International News

Updated Date - Nov 06 , 2024 | 03:47 PM