ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

PM Modi: మీ ఆతిథ్యం మరవలేనిది.. అయోధ్య మహిళకు ప్రధాని లేఖ..

ABN, Publish Date - Jan 04 , 2024 | 03:03 PM

అయోధ్య రామాలయ నిర్మాణ పనులు, ప్రారంభోత్సవ కార్యక్రమాలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నారు. మందిర నిర్మాణ పనులను పర్యవేక్షించేందుకు వీలు దొరికినప్పుడల్లా అయోధ్యను సందర్శిస్తున్నారు.

అయోధ్య రామాలయ నిర్మాణ పనులు, ప్రారంభోత్సవ కార్యక్రమాలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నారు. మందిర నిర్మాణ పనులను పర్యవేక్షించేందుకు వీలు దొరికినప్పుడల్లా అయోధ్యను సందర్శిస్తున్నారు. ఇందులో భాగంగా గతేడాది డిసెంబర్ 30న ప్రధాని అయోధ్యలో పర్యటించారు. ఈ క్రమంలో పీఎం.. మీరా మాఝీ అనే మహిళ ఇంటికి వెళ్లారు. ఆమె ఇంట్లో టీ తాగారు. ఉజ్వల లబ్ధిదారు అయిన మీరా మాంఝీ.. ప్రధాని తమ ఇంటికి రావడంపై ఆనందం వ్యక్తం చేశారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పారని, తమ ఇంట్లో టీ తాగారని గుర్తు చేసుకున్నారు.

ఈ క్రమంలో అయోధ్యలో తనకు ఆతిథ్యం ఇచ్చిన మహిళకు ప్రధాని మోదీ లేఖ రాశారు. "మిసెస్ మీరా దేవి జీ, మీకు, కుటుంబ సభ్యులందరికీ 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు. శ్రీ రాముని పవిత్ర నగరమైన అయోధ్యలో మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యులను కలుసుకోవడం, మీరు తయారుచేసిన టీ తాగడం చాలా ఆనందంగా ఉంది.. కోట్లాది మంది భారతీయుల సంతోషమే నా సంపద. దేశం కోసం పనిచేయడానికి ఇది నాకు మరింత శక్తిని ఇస్తుంది. అని లేఖలో ప్రస్తావించారు.

Updated Date - Jan 04 , 2024 | 03:14 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising