PM Modi: వీరభద్ర ఆలయంలో 'రామ్ భజన్' ఆలపించిన మోదీ
ABN, Publish Date - Jan 16 , 2024 | 09:27 PM
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా లేపాక్షిలోని వీరభద్రస్వామి, దుర్గాదేవికి ప్రత్యేక పూజలు సందర్భంలో శ్రీరామ భజనలో పాల్గొన్నారు. 'శ్రీరామ్ జై రామ్' అంటూ భజన గీతాన్ని ఆలపిస్తూ, రంగనాథ రామాయణంలోని పద్యాలను ఎంతో ఆసక్తిగా విన్నారు.
అమరావతి: లేపాక్షిలోని వీరభద్రస్వామి, దుర్గాదేవికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) మంగళవారంనాడు ప్రత్యేక పూజలు చేశారు. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) పర్యటనలో భాగంగా ఆయన వీరభద్రస్వామిని దర్శించారు. ఆలయంలో జరిగిన శ్రీరామ భజనలో పాల్గొన్నారు. 'శ్రీరామ్ జై రామ్' అని ఆలపిస్తూ, రంగనాథ రామాయణంలోని పద్యాలను ఎంతో ఆసక్తిగా విన్నారు. రంగనాథ రామాయణం ఆధారిత నృత్య ప్రదర్శనను వీక్షించారు. లేపాక్షి ఆలయం ప్రాంగణం చుట్టూ ఉన్న శిల్పకళా సంపదను చూస్తూ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈనెల 22న అయోధ్యలో రామాలయ ప్రాణప్రతిష్ఠలో పాల్గొంటున్న ప్రధానమంత్రి ఉపవాస దీక్షను కూడా కొనసాగిస్తున్నారు.
Updated Date - Jan 17 , 2024 | 02:29 PM