ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

PM Modi: రాజస్థానీ లెహెరియా తలపాగా ధరించిన ప్రధాని మోదీ.. ప్రత్యేకత ఏంటో తెలుసా?

ABN, Publish Date - Aug 15 , 2024 | 08:46 AM

దేశవ్యాప్తంగా 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పిల్లలు, పెద్దలు అందరూ జాతీయ పతాక ఆవిష్కరణల్లో పాల్గొంటున్నారు. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోట వేదికగా స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. వరుసగా 11వ సారి ఆయన ప్రతిష్టాత్మక ఎర్రకోటపై జెండా ఎగురవేశారు.

PM Narendra Modi

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పిల్లలు, పెద్దలు అందరూ జాతీయ పతాక ఆవిష్కరణల్లో పాల్గొంటున్నారు. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోట వేదికగా స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. వరుసగా 11వ సారి ఆయన ప్రతిష్టాత్మక ఎర్రకోటపై జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆహార్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మోదీ తెల్లటి కుర్తా, చుడీదార్, లేత నీలం రంగు బంద్‌గాలా జాకెట్‌ ధరించారు. ముఖ్యంగా ఆయన ఇవాళ (ఆగస్టు 15) రాజస్థానీ లెహెరియా ప్రింట్ తలపాగా ధరించి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు.


స్వాతంత్య్ర దినోత్సవం నాడు వైవిధ్య భరితమైన ప్రత్యేక తలపాగాలను ధరించే సంప్రదాయాన్ని ప్రధాని మోదీ ఈసారి కూడా కొనసాగించారు. ఇవాళ ధరించిన తలపాగా నారింజ, పసుపు, ఆకుపచ్చ రంగుల్లో ఉంది. తలపాగాకు ఉన్న పొడవాటి తోక కూడా ఈ మూడు రంగుల కలయికలోనే ఉంది. రాజస్థాన్‌కు చెందిన సాంప్రదాయ టెక్స్‌టైల్ టెక్నిక్‌తో దీనిని తయారు చేశారు. ఈ లెహెరియా డిజైన్‌ను థార్ ఎడారిలో కనిపించే ‘నేచురల్ వేవ్’ నమూనా నుంచి ప్రేరణగా తీసుకొని తయారు చేశారు.


ఇక గతేడాది స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం సందర్భంగా ప్రధాని మోదీ పసుపు, ఆకుపచ్చ, ఎరుపు రంగుల కలయికతో తయారు చేసిన రాజస్థానీ బంధాని ప్రింట్ తలపాగాను ధరించారు. ఇక అంతక్రితం ఏడాది2022లో ఎరుపు రంగు నమూనా, కుంకుమ పువ్వు రంగు రంగులో ఉన్న పొడవాటి తోక ఉన్న తలపాగాను మోదీ ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.


మోదీ కీలక సందేశం

స్వాతంత్య్ర సమరయోధులకు దేశం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుంది. వారి త్యాగాలను స్మరించుకునే రోజు ఇది. 20వ శతాబ్దపు తొలి నాళ్లలో 40 కోట్ల మంది భారతీయులు ఒక్కతాటిపైకి వచ్చి దేశం నుంచి బ్రిటీష్ పాలనను తరిమికొట్టారు. అప్పుడు 40 కోట్ల మంది జనాభా ఉన్నారు. నేడు మనం 140 కోట్ల మంది జనాభా ఉన్నాం. 40 కోట్ల మంది ఆ నాడు కష్టమైన పనిని సాధించి చూపారు. నేడు 140 కోట్ల మంది మనం దేశాన్ని ముందుకు సాగించగలం. నాడు ఆ 40 కోట్ల మందిలో చాలా మంది స్వేచ్ఛ, స్వాతంత్ర్యాల కోసం ప్రాణాలు అర్పించారు. నేడు 140 కోట్ల మంది దేశం కోసం బతకాలి. దేశాన్ని ముందుకు నడిపించాలి’’ అని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.


గర్వంగా తలలు పైకెత్తాం: మోదీ

‘‘లోకల్ కోసం వోకల్ నినాదం స్వావలంబన మంత్రంగా మారింది. మనం అడుగులు వేసేటప్పుడు, భవిష్యత్ ప్రాణాలను సిద్ధం చేసుకునే ప్రతి ప్రయత్నం వెనుక ‘మేరా భారత్ మహాన్’ పదాలు ఆత్మగా ఉంటాయి. కోవిడ్ వంటి మహమ్మారి సమయంలో ఇతరులకు సాయం చేసేందుకు దేశ ప్రజలు ముందుకు రావడం మనం చూశాం. మన కరోనా వారియర్స్ అవసరమైన వారికి సేవ చేసిన విధానం, మన సైనికులు సర్జికల్ స్ట్రైక్స్ చేయడం చూశాం. ఇక మన వైమానిక దళం వైమానిక దాడులు చేయడం చూసినప్పుడు ప్రతి భారతీయుడు వారిని చూసి గర్వంగా తలలు పైకెత్తాం’’ అని మోదీ అన్నారు.

Updated Date - Aug 15 , 2024 | 08:51 AM

Advertising
Advertising
<