ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

wayanad landslide: వయనాడ్‌కు ప్రధాని మోదీ..!

ABN, Publish Date - Aug 08 , 2024 | 01:31 PM

వయనాడ్‌‌లో చోటు చేసుకున్న ఈ విపత్తును జాతీయ విపత్తుగా ప్రకటించాలని ప్రధాని నరేంద్ర మోదీకి లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతోపాటు కేరళ, కర్ణాటక, మహారాష్ట్రలకు చెందిన ఎంపీలు విజ్జప్తి చేసిన విషయం విధితమే. అలాంటి వేళ ప్రధాని మోదీ వయనాడ్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటన అనంతరం జాతీయ విపత్తుగా ప్రధాని మోదీ ప్రకటించే అవకాశముందని ఓ చర్చ సైతం తాజాగా ఊపందుకుంది.

PM Modi

న్యూఢిల్లీ, ఆగస్ట్ 08: ప్రకృతి సృష్టించిన బీభత్సంతో కేరళలో వయనాడ్ జిల్లాలోని చూరల్మల, ముండక్క గ్రామాలు దారుణంగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్ట్ 10వ తేదీన.. అంటే శనివారం ఆ యా గ్రామాల్లో పర్యటించనున్నారు. అలాగే నిరాశ్రయులు తలదాచుకున్న పునరావాస కేంద్రాలను సైతం ఆయన ఈ పర్యటనలో భాగంగా సందర్శించనున్నారు.

Also Read: Bangladesh Violence: భారతీయ వీసా సెంటర్లు క్లోజ్.. యూరప్‌కు హసీనా


జాతీయ విపత్తుగా ప్రకటించాలని..

వయనాడ్‌‌లో చోటు చేసుకున్న ఈ విపత్తును జాతీయ విపత్తుగా ప్రకటించాలని ప్రధాని నరేంద్ర మోదీకి లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతోపాటు కేరళ, కర్ణాటక, మహారాష్ట్రలకు చెందిన ఎంపీలు విజ్జప్తి చేసిన విషయం విధితమే. అలాంటి వేళ ప్రధాని మోదీ వయనాడ్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటన అనంతరం జాతీయ విపత్తుగా ప్రధాని మోదీ ప్రకటించే అవకాశముందని ఓ చర్చ సైతం తాజాగా ఊపందుకుంది.

Also Read: LokSabha: వక్ఫ్ బోర్డ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నోటీసులు


417కు చేరిన మృతులు..

వయనాడ్‌ జిల్లాలో భారీ వర్షాలు, వరదలు, కొండ చరియలు విరిగి పడడంతో మృతుల సంఖ్య 417కు చేరింది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముందని సమాచారం. అలాగే వందలాది మంది గల్లంతయ్యారు. వారి కోసం నేటికి గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. 10 వేల మందికి పైగా నిరాశ్రయులు వివిధ పునరావాస కేంద్రాల్లో తల దాచుకున్న సంగతి తెలిసిందే.

Also Read: Maharashtra politics: తమ్ముడు నేటి నుంచి.. అన్నయ్య రేపటి నుంచి..

Also Read: Viral: గర్ల్ ఫ్రెండ్‌ కోసం.. ఓ టీనేజర్ ఘనకార్యం


లోక్‌సభలో జీరో అవర్‌లో...

మరోవైపు బుధవారం లోక్‌సభలో జీరో అవర్‌లో వయనాడు అంశంపై వాడి వేడి చర్చ జరిగింది. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. వయనాడ్ ప్రజలకు నష్ట పరిహారం ప్రకటించాలని మోదీ ప్రభుత్వాన్ని రాహుల్ డిమాండ్ చేశారు. ఈ విపత్తు సంభవించిన ప్రాంతాల్లో తాను పర్యటించానన్నారు. ఈ విపత్తులో మొత్తం కుటుంబం కుటుంబమే తుడుచు పెట్టుకుని పోయిందన్నారు. ఇక కొన్ని చోట్ల అయితే కుటుంబంలో ఒక్కరు మాత్రమే మిగిలారని చెప్పారు. అదీ కూడా ఇంట్లో పెద్ద వారు లేకుంటే చిన్నారుల్లో ఒక్కరే మిగిలి ఉన్నారని... ఇటువంటి ఘటనలు వయనాడ్ జిల్లాలో కోకొల్లలుగా ఉన్నాయని రాహుల్ గాంధీ ఈ సందర్భంగా వివరించారు.

Also Read:Bangladesh Violence: భారత్‌లోని బంగ్లాదేశీ విద్యార్థుల్లో ‘ఆందోళన’

Also Read: Vinesh Phogat: ‘నాపై కుస్తీ గెలిచింది.. నేను ఓడిపోయాను’


పర్యటించిన ప్రియాంక, రాహుల్...

కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీతోపాటు ప్రియాంక గాంధీ ఇటీవల వయనాడ్‌ జిల్లాలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఇంకోవైపు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఇటీవల కీలక ప్రకటన చేశారు. భారీ వర్షాలు, వరదలపై కేరళ ప్రభుత్వాన్ని ముందే హెచ్చరించామని చెప్పారు. కానీ కేరళ ప్రభుత్వం తమ హెచ్చరికలను బేఖాతరు చేసిందన్నారు. దీనిపై కేరళ సీఎం పినరయి రవి స్పందించారు. మోదీ ప్రభుత్వం ఎటువంటి హెచ్చరికలు జారీ చేయలేదన్నారు. ఆ క్రమంలో హోం శాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా కేరళ సీఎం పినరయి రవి ఖండించారు.

Read More National News and Latest Telugu News

Updated Date - Aug 08 , 2024 | 01:33 PM

Advertising
Advertising
<