మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Pune Car Crash: పుణె కారు ప్రమాదం కేసులో బయటపడ్డ మాస్టర్ ప్లాన్.. క్రైమ్ త్రిల్లర్ సినిమాని మించిన ట్విస్ట్

ABN, Publish Date - May 28 , 2024 | 07:08 PM

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పుణె కారు ప్రమాదం కేసులో రోజుకో షాకింగ్ విషయం వెలుగులోకి వస్తోంది. ఇప్పటికే ఇద్దరు వైద్యులు ప్రధాన నిందితుడి రక్త నమూనాలను

Pune Car Crash: పుణె కారు ప్రమాదం కేసులో బయటపడ్డ మాస్టర్ ప్లాన్.. క్రైమ్ త్రిల్లర్ సినిమాని మించిన ట్విస్ట్

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పుణె కారు ప్రమాదం (Pune Car Crash) కేసులో రోజుకో షాకింగ్ విషయం వెలుగులోకి వస్తోంది. ఇప్పటికే ఇద్దరు వైద్యులు ప్రధాన నిందితుడి రక్త నమూనాలను మార్చారన్న విషయం బట్టబయలైంది. పోలీసులు నిర్వహించిన కౌంటర్ ఆపరేషన్‌తో.. ఆ వైద్యుల బండారం బయటపడింది. ఇప్పుడు వాళ్లు ఈ మాస్టర్ ప్లాన్ ఎలా అమలు చేశారు? ఇందులో ప్యూన్ పాత్ర ఏమిటి? అనే వివరాలన్ని బయటపడ్డాయి.


రక్త నమూనాల మార్పిడి

కారు ప్రమాదం జరిగిన రోజు నిందితుడైన మైనర్‌ని అరెస్ట్ చేసిన పోలీసులు.. వైద్య పరీక్షల నిమిత్తం సాసూన్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ అతని రక్త నమూనాని సేకరించిన తర్వాత.. డాక్టర్ తావ్‌రే నిందితుడి తండ్రికి ఫోన్ చేశాడు. ఈ ఫోన్ సంభాషణలో భాగంగా.. నిందితుడి రక్త నమూనాల్ని మార్చేస్తే, భారీ మొత్తం ఇచ్చేలా ఇద్దరి మధ్య రూ.3 లక్షల డీల్ కుదిరింది. ఇదే సమయంలో.. తమ ప్లాన్‌ని ఆ డాక్టర్ వెల్లడించాడు. మైనర్ రక్త నమూనాల స్థానంలో.. మరో డాక్టర్ నమూనాల్ని పెడతామని చెప్పాడు. మొత్తానికి డీల్ కుదిరాక.. ప్యూన్‌గా పనిచేసే అతుల్‌ ఘట్‌కాంబ్లే ఆ డబ్బులను తీసుకొచ్చాడు. తమకు డబ్బులు అందాక వైద్యులు తమ ప్లాన్ అమలు చేశారు. నిందితుడి రక్త నమూనాల్ని చెత్తబుట్టలో పారేసి.. మరో వ్యక్తి రక్తం తీసి, దాన్ని పరీక్షలకు పంపించారు. తావ్‌రే సూచనల మేరకు.. చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ శ్రీహరి హర్నోల్ ఈ రక్త నమూనాల్ని మార్చాడు.


పోలీసుల కౌంటర్ ఆపరేషన్

మరోవైపు.. నిందితుడి రక్త నమూనాలను మార్చేసే అవకాశం ఉందని దర్యాప్తు బృందానికి అనుమానం వచ్చింది. దీంతో.. వాళ్లు తెలివిగా ప్రమాదం జరిగిన రోజే నిందితుడి నుంచి రహస్యంగా రక్త నమూనాని సేకరించారు. దానిని ఆంధ్‌ జిల్లా ఆస్పత్రిలోని ఫోరెన్సిక్‌ విభాగానికి పంపారు. మే 20వ తేదీన.. పోలీసులు సేకరించిన రక్త నమూనాతో పాటు వైద్యులు ఇచ్చిన రక్త నమూనాని డీఎన్ఏ పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. మే 21న నిందితుడి తండ్రిని అరెస్ట్ చేసి.. జన్యు పరీక్షల నిమిత్తం ఆయన నుంచి రక్త నమూనాని సేకరించారు. ఈ మూడు టెస్టుల రిపోర్ట్ మే 26వ తేదీన వచ్చింది. సాసూన్ ఆసుపత్రి వైద్యులు పంపిన రక్త స్వాబ్‌తో నిందితుడి తండ్రి డీఎన్‌ఏ సరిపోలలేదు. అయితే.. పోలీసులు రహస్యంగా పంపిన రక్త స్వాబ్‌తో మాత్రం మ్యాచ్ అయ్యింది. ఈ విధంగా వైద్యులు రక్త నమూనాని మార్చారన్న విషయం తేలింది.

Read Latest National News and Telugu News

Updated Date - May 28 , 2024 | 07:09 PM

Advertising
Advertising