ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP News: వివాహిత దుర్మరణంపై రాజకీయ దుమారం! అసలేం జరిగిందంటే?

ABN, Publish Date - Mar 12 , 2024 | 02:31 AM

ఒక వివాహిత దుర్మరణం రాజకీయ దుమారం లేపింది. టీడీపీ మద్దతుదారుల ట్రోలింగ్‌ వల్లే ఆమె ఆత్మహత్య చేసుకుందని వైసీపీ సోషల్‌ మీడియా ఆరోపించగా... ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారని టీడీపీ పేర్కొంది. వివరాల్లోకి వెళితే... గుంటూరు జిల్లా తెనాలికి చెందిన జి.గీతాంజలి (32) అనే వివాహిత ఈ నెల 7న తెనాలిలో రైలుకు ఎదురుగా వెళ్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అప్పటినుంచి గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గీతాంజలి సోమవారం తెల్లవారుజామున మరణించారు.

నాలుగు రోజుల కిందట రైలు ఢీ

మరణం తర్వాత మొదలైన వివాదం

ట్రోలింగ్‌ కారణమన్న వైసీపీ సోషల్‌ మీడియా

ఖండించిన తెలుగుదేశం పార్టీ

తెనాలి, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): ఒక వివాహిత దుర్మరణం రాజకీయ దుమారం లేపింది. టీడీపీ మద్దతుదారుల ట్రోలింగ్‌ వల్లే ఆమె ఆత్మహత్య చేసుకుందని వైసీపీ సోషల్‌ మీడియా ఆరోపించగా... ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారని టీడీపీ పేర్కొంది. వివరాల్లోకి వెళితే... గుంటూరు జిల్లా తెనాలికి చెందిన జి.గీతాంజలి (32) అనే వివాహిత ఈ నెల 7న తెనాలిలో రైలుకు ఎదురుగా వెళ్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అప్పటినుంచి గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గీతాంజలి సోమవారం తెల్లవారుజామున మరణించారు. ఆ తర్వాతే అసలు వివాదం మొదలైంది.

అసలేం జరిగిందంటే...

ఈనెల 4వ తేదీన గీతాంజలి తెనాలిలో ఎమ్మెల్యే చేతుల మీదుగా ఇంటి పట్టా అందుకున్నారు. అదే సమయంలో ఒక స్థానిక ప్రైవేట్‌ చానల్‌ ఆమెను ఇంటర్వ్యూ చేసింది. ఇంటిపట్టా అందుకున్న గీతాంజలి...తన సొంత ఇంటి కల నెరవేరిందని ఆనందంగా తెలిపారు. ఐదేళ్లు ‘అమ్మఒడి’ అందుకున్నానని, ఒక సంవత్సరం ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేశానని చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే తమ కుటుంబానికి సన్నిహితుడని, తమ ఇంట్లో జరిగిన వేడుకలకూ హాజరయ్యారని తెలిపారు. చంద్రబాబు, లోకేశ్‌, పవన్‌, షర్మిల తదితరులకు సంబంధించిన ప్రశ్నలకు స్పందిస్తూ... జగన్‌కే తన మద్దతు అని చెప్పారు. దీనిని వైసీపీ సోషల్‌ మీడియా తన ప్రచారం కోసం వాడుకుంది. దీనిపై కొందరు స్పందిస్తూ... ‘అమ్మ ఒడి ఇచ్చిందే నాలుగేళ్లయితే, ఐదేళ్లు ఎలా తీసుకున్నారు? జగనన్నా... ఏమిటిది?’ వంటి కామెంట్లు పెట్టారు. దీనివల్లే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు వైసీపీ సోషల్‌ మీడియా ప్రచారం మొదలుపెట్టింది.

తప్పుడు ప్రచారం నమ్మొద్దు: టీడీపీ

వైసీపీ పేటీఎం బ్యాచ్‌ ఫేక్‌ ప్రచారాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని టీడీపీ కోరింది. జగన్‌ ‘సిద్ధం’ సభ అట్టర్‌ ఫ్లాప్‌ కావడంతో, జనం దృష్టిని మరల్చడానికి ఫేక్‌ ప్రచారానికి దిగిందని టీడీపీ మండిపడింది. గీతాంజలి మరణానికి టీడీపీ కారణమంటూ నారా లోకేశ్‌ పేరు మీద ‘ఎక్స్‌’లో ఫేక్‌ పోస్టులు సృష్టించి దుష్ప్రచారం చేసిందని... వీటిని నమ్మవద్దని ప్రజలను కోరింది. సోషల్‌ మీడియాలో గీతాంజలినినేరుగా నిందించడం, పరుషపదజాలంతో దూషించడం జరగలేదని తెలిపింది. దీనిపై జనసేన పీఏసీ చైర్మన్‌ మనోహర్‌ కూడా స్పందించారు. గీతాంజలి మరణం బాధాకరమని తెలిపారు. ఆమె మరణాన్ని తాము రాజకీయంగా ఉపయోగించుకోవడానికి ఆమె కుటుంబ సభ్యులు ఇష్టపడటం లేదని చెప్పారు.

Updated Date - Mar 12 , 2024 | 08:35 AM

Advertising
Advertising