ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Poverty in India: కరోనా సవాళ్లు ఎదురైనా భారీగా తగ్గిన పేదరికం.. ఎకనామిక్ థింక్ ట్యాంక్ రిపోర్టులో వెల్లడి

ABN, Publish Date - Jul 03 , 2024 | 06:46 PM

దేశవ్యాప్తంగా గడిచిన కొన్ని సంవత్సరాలలో పేదరికం(Poverty in India) భారీగా తగ్గిందని ఓ నివేదిక వెల్లడించింది. కరోనా సవాళ్లు ఎదురైనా పేదరికం తగ్గిందని చెప్పింది. 2011-12లో దేశవ్యాప్తంగా 21.2 శాతంగా ఉన్న పేదరికం 2022-24 నాటికి 8.5 శాతానికి తగ్గిందని ఎకనామిక్ థింక్ ట్యాంక్ NCAER పరిశోధనా పత్రం నివేదించింది.

ఢిల్లీ: దేశవ్యాప్తంగా గడిచిన కొన్ని సంవత్సరాలలో పేదరికం(Poverty in India) భారీగా తగ్గిందని ఓ నివేదిక వెల్లడించింది. కరోనా సవాళ్లు ఎదురైనా పేదరికం తగ్గిందని చెప్పింది. 2011-12లో దేశవ్యాప్తంగా 21.2 శాతంగా ఉన్న పేదరికం 2022-24 నాటికి 8.5 శాతానికి తగ్గిందని ఎకనామిక్ థింక్ ట్యాంక్ NCAER పరిశోధనా పత్రం నివేదించింది.

ఎన్‌సీఏఈఆర్‌కి చెందిన సోనాల్డే దేశాయ్ రచించిన 'రిథింకింగ్ సోషల్ సేఫ్టీ నెట్స్ ఇన్ ఎ ఛేంజింగ్ సొసైటీ' అనే పేపర్, ఇండియా హ్యూమన్ డెవలప్‌మెంట్ సర్వే (IHDS)లో కొత్తగా పూర్తి చేసిన వేవ్ 1, 2, 3 డేటా సాయంతో ఈ నివేదిక రూపొందించారు.


IHDS పరిశోధనల ప్రకారం.. 2004-2005, 2011-12 మధ్య పేదరికం గణనీయంగా (హెడ్‌కౌంట్ నిష్పత్తి 38.6 నుండి 21.2) తగ్గింది. ఇది 2011-12, 2022-24 మధ్య 21.5 నుంచి 8.2కి తగ్గుతూ వచ్చింది. ఆర్థిక వృద్ధి, పేదరికం తగ్గుదల చైతన్యవంతమైన సమాజాన్ని సృష్టిస్తాయని పేర్కొంది. అయితే దీర్ఘకాలికంగా ఇంకా పేదరికంలో బాధపడుతున్న వారిని దాంట్లోంచి బయటపడేయటం ప్రభుత్వాల ముందు ఉన్న పెద్ద పనిగా పేర్కొంది. దేశంలో పేదరికం 5 శాతానికి తగ్గిందని, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజలు సంపన్నులు అవుతున్నారని ఈ ఏడాది ప్రారంభంలో నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రహ్మణ్యం తెలిపారు.

For Latest News and National News click here

Updated Date - Jul 03 , 2024 | 06:48 PM

Advertising
Advertising