Bal Puraskar Award: ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డుల ప్రకటన
ABN, Publish Date - Jan 19 , 2024 | 11:32 AM
ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డులను కేంద్ర ప్రభుత్వం శుక్రవారం నాడు ప్రకటించింది. 19 మంది చిన్నారులను అవార్డులకు ఎంపిక చేసింది. జనవరి 22వ తేదీన విజ్ఞాన్ భవన్‌లో అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం జరగనుంది.
ఢిల్లీ: ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ (Pradhan Mantri Rashtriya Bal Puraskar) అవార్డులను కేంద్ర ప్రభుత్వం శుక్రవారం నాడు ప్రకటించింది. 19 మంది చిన్నారులను అవార్డులకు (awards) ఎంపిక చేసింది. జనవరి 22వ తేదీన విజ్ఞాన్ భవన్‌లో అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చిన్నారులకు అవార్డులను అందజేస్తారు. అవార్డు గ్రహీతలతో ప్రధాని నరేంద్ర మోదీ జనవరి 23వ తేదీన సమావేశం అవుతారు. 22వ తేదీన అయోధ్యలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ఉంది. ఆ రోజు ప్రధాని మోదీ అయోధ్యలో ఉంటారు. మరుసటి రోజు ఢిల్లీలో చిన్నారులను కలుస్తారు. 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 19 మంది చిన్నారులను బాల పురస్కార్ అవార్డులకు కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ఎంపిక చేసింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
Updated Date - Jan 19 , 2024 | 11:32 AM