Prajwal Revanna: జులై 8 వరకు జ్యుడిషియల్ కస్టడీ పొడగింపు
ABN, Publish Date - Jun 24 , 2024 | 08:24 PM
లైంగిక దాడి, లైంగిక ఆరోపణల కేసులో అరెస్టయిన జేడీ(ఎస్) మాజీ నేత, మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ప్రత్యేక దర్యాప్తు బృందం( సిట్) అరెస్ట్ చేసిన ప్రజ్వల్ కస్టడీ సోమవారంతో ముగిసింది.
బెంగుళూరు, జూన్ 24: లైంగిక దాడి, లైంగిక ఆరోపణల కేసులో అరెస్టయిన జేడీ(ఎస్) మాజీ నేత, మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ప్రత్యేక దర్యాప్తు బృందం( సిట్) అరెస్ట్ చేసిన ప్రజ్వల్ కస్టడీ సోమవారంతో ముగిసింది. ఈ నేపథ్యంలో అతడికి కోర్టు 14 రోజుల పాటు అంటే జులై 8వ తేదీ వరకు కస్టడీని పొడిగించింది. ఇదిలావుండగా ప్రజ్వల్ బెయిల్ పిటిషన్ అదనపు సిటీ సివిల్ సెషన్స్ జడ్జి ముందుకు రాగా.. ఆ ఉత్తర్వులను జూన్ 26వ తేదీకి కోర్టు రిజర్వ్ చేసింది.
Also Read:JP Nadda: ‘కళ్లకురిచ్చి’పై మౌనం ఎందుకు?
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల వేళ జేడీ(ఎస్) నాయకుడు, హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ రాసలీల పెన్ డ్రైవ్ వెలుగులోకి వచ్చింది. దాంతో కర్ణాటకలో రాజకీయ దుమారం రేగింది. అలాంటి వేళ ప్రజ్వల్ గుట్టుచప్పుడు కాకుండా జర్మనీ వెళ్లిపోయారు. ఆ క్రమంలో అతడి తాత, మాజీ ప్రధాని హెచ్ డి దేవగౌడ.. తన మనవడు ప్రజ్వల్‌కు బహిరంగ లేఖ రాశారు. పోలీసుల ముందు లొంగిపోవాలని అతడికి సూచించారు.
Also Read: Robert Vadra: రాహుల్ గాంధీపై ప్రశంసల జల్లు
అనంతరం ప్రజ్వల్.. ఓ వీడియో సందేశాన్ని సైతం విడుదల చేశారు. తనకు చట్టంపై నమ్మకముందన్నారు. అలాగే తాను మే 31న బెంగుళూరు పోలీసుల ముందు లొంగిపోతానని ప్రజ్వల్ ఆ వీడియోలో స్పష్టం చేశారు. అందులోభాగంగా మే 31వ తేదీ తెల్లవారుజామున జర్మనీ నుంచి వచ్చిన ప్రజ్వల్‌ను బెంగుళూరు ఎయిర్ పోర్ట్‌లో సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ ఆరోపణల నేపథ్యంలో ప్రజ్వల్‌పై జేడీ(ఎస్) పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. దేవగౌడ పెద్ద కుమారుడు హెచ్ డి రేవణ్ణ కుమారుడే ఈ ప్రజ్వల్ రేవణ్ణ.
Also Read: Jagtial Politics: కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కీలక నిర్ణయం..!
For Latest News and National News click here
Updated Date - Jun 24 , 2024 | 08:24 PM