ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

BJP : అభివృద్ధికే పట్టం

ABN, Publish Date - Nov 24 , 2024 | 04:41 AM

తాజా ఎన్నికల్లో ప్రజలు అభివృద్ధికే పట్టం కట్టారని ప్రధాని మోదీ అన్నారు. అబద్ధాలు, వంచన రాజకీయాలకు పాల్పడిన కాంగ్రెస్‌, దాని

బీజేపీ విజయోత్సవ సభలో ప్రధాని మోదీ

న్యూఢిల్లీ, నవంబరు 23: తాజా ఎన్నికల్లో ప్రజలు అభివృద్ధికే పట్టం కట్టారని ప్రధాని మోదీ అన్నారు. అబద్ధాలు, వంచన రాజకీయాలకు పాల్పడిన కాంగ్రెస్‌, దాని మిత్రపక్షాలను ఓడించారని చెప్పారు. వశనివారం రాత్రి ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విజయోత్సవ సభలో మోదీ ప్రసంగించారు. మహారాష్ట్ర అన్ని రికార్డులను బ్రేక్‌ చేసిందన్నారు. గడిచిన 50 ఏళ్లలో ఏ పార్టీ గానీ, ఎన్నికల ముందు ఏర్పాటైన కూటమిగానీ ఇంతటి ఘన విజయం సాధించలేదని చెప్పారు. ఈ ఎన్నికల్లో మహారాష్ట్ర నుంచి వచ్చిన అతిపెద్ద సందేశం ఐక్యతేనని పేర్కొన్నారు. ‘ఐక్యంగా ఉంటేనే సురక్షితంగా ఉంటాం (ఏక్‌ హై తో సేఫ్‌ హై)’ అనే నినాదమే ఇప్పుడు దేశానికి మహా మంత్రంగా మారిందని చెప్పారు. కులం, మతం ఆధారంగా దేశాన్ని విభజించాలని కోరుకున్న వారికి ప్రజలు బుద్ధి చెప్పారన్నారు. అన్ని వర్గాల ప్రజలు బీజేపీకి ఓటేశారని మోదీ చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారం కోసం కులతత్వం అనే విషాన్ని వ్యాపింపజేస్తోందని మండిపడ్డారు. మహారాష్ట్రలో అస్థిరతను సృష్టించేందుకు యత్నించిన, ద్రోహానికి పాల్పడిన కొందరిని ఓటర్లే శిక్షించారని ప్రధాని మోదీ చెప్పారు. ‘దేశమే ముందు’ అనే వారితో తప్ప ‘కుర్చీయే ముందు’ అనే వారిని ఓటర్లు నమ్మరని తేలిపోయిందన్నారు. ప్రపంచంలోని ఏ శక్తీ ఆర్టికల్‌ 370ను పునరుద్ధరించలేదని పునరుద్ఘాటించారు. కాంగ్రెస్‌ బుజ్జగింపు రాజకీయాలకు వక్ఫ్‌బోర్డే ఉదాహరణ అన్నారు. ‘‘కాంగ్రెస్‌ పార్టీ బుజ్జగింపుల కోసమే చట్టాలు చేసింది. వక్ఫ్‌ చట్టమే దానికి ఉదాహరణ. 2014లో ఢిల్లీ సమీపంలోని చాలా ఆస్తులను వక్ఫ్‌ బోర్డుకు కట్టబెట్టారు. రాజ్యాంగంలో వక్ఫ్‌ చట్టానికి చోటే లేదు. కానీ, ఇప్పటికీ ఈ సదుపాయాన్ని కాంగ్రెస్‌ పార్టీ తమ కుటుంబ ఓటు బ్యాంకుగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అసలైన లౌకికవాదాన్ని చంపేసే ప్రయత్నం చేస్తోంది’’ అని మోదీ ధ్వజమెత్తారు.

Updated Date - Nov 24 , 2024 | 04:41 AM