Narendra Modi: రూ.11,600 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన..వీటితో ఉపాధి కూడా
ABN, Publish Date - Feb 04 , 2024 | 01:13 PM
అసోం(assam)లో మొత్తం రూ.11,600 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ప్రధాని నరేంద్ర మోదీ(narendra modi) ఆదివారం శంకుస్థాపన చేశారు. గౌహతి ఖానాపరాలోని వెటర్నరీ కళాశాల మైదానంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ సందర్భంగా ప్రసంగించారు.
అసోం(assam)లో మొత్తం రూ.11,600 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ప్రధాని నరేంద్ర మోదీ(narendra modi) ఆదివారం శంకుస్థాపన చేశారు. గౌహతి ఖానాపరాలోని వెటర్నరీ కళాశాల మైదానంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ సందర్భంగా ప్రసంగించారు. ఈ ప్రాజెక్టులన్నీ అసోం సహా మిగిలిన ఈశాన్య ప్రాంతాలు, ఆగ్నేయాసియా దేశాలతో కనెక్టివిటీని పెంచుతాయని ప్రధాని అన్నారు. ఇవి పర్యాటక రంగంలో మరింత ఉపాధి అవకాశాలను సృష్టిస్తాయి, క్రీడా ప్రతిభను పెంచుతాయని చెప్పారు. దీంతోపాటు ఈ ప్రాంతంలో వైద్య విద్య, ఆరోగ్య సంరక్షణను మెరుగుపరుస్తాయని మోదీ పేర్కొన్నారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Union Bank of india: 606 స్పెషలిస్ట్ ఆఫీసర్స్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం...అప్లై చేశారా ?
అంతకు ముందు రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని నరేంద్ర మోదీ శనివారం గౌహతి(guwahati) చేరుకోగా.. గవర్నర్ గులాబ్ చంద్ కటారియా, సీఎం హిమంత బిశ్వ శర్మ ప్రధాని మోదీకి స్వాగతం పలికారు. ఆ తర్వాత బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీతో మోదీ సమావేశమై పార్టీ విషయాలపై చర్చించారు.
మరోవైపు మోదీ అసోం పర్యటనకు ముందు రాష్ట్రంలో పౌరసత్వ సవరణ చట్టం (CAA) అమలుకు వ్యతిరేకంగా నిరసనలు జరిగాయి. సీఏఏకు వ్యతిరేకంగా కో ఆర్డినేషన్ కమిటీ శనివారం మధ్యాహ్నం గౌహతిలోని లఖిధర్ బోరా ఖేత్రాలో ప్రదర్శన నిర్వహించింది. ప్రముఖ హాజరైన వారిలో సాహిత్య అకాడమీ నుంచి అవార్డు గెలుచుకున్న రచయిత హిరేన్ గోహైన్, వివిధ రంగాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇతర ప్రముఖ పౌరులు కూడా ఉన్నారు.
Updated Date - Feb 04 , 2024 | 01:13 PM