ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Pune car crash: ఆరోపణలపై స్పందించిన డిప్యూటీ సీఎం

ABN, Publish Date - Jun 01 , 2024 | 04:14 PM

పుణే కారు ప్రమాదం కేసులో తనపై స్థానిక ఎమ్మెల్యే సునీల్ టింగ్రే చేస్తున్న ఆరోపణలను మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఖండించారు. తనపై చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని ఆయన స్పష్టం చేశారు. ఈ కారు ప్రమాదం కేసులో నిందితుడికి అనుకూలంగా వ్యవహారించాలంటూ పుణే పోలీసులను తాను ఆదేశించానంటూ ఎన్సీపీ ఎమ్మెల్యే ఆరోపణలపై అజిత్ పవార్ స్పందించారు.

Maharashtra Deputy Chief Minister Ajit Pawar

ముంబై, జూన్ 1: పుణే కారు ప్రమాదం కేసులో తనపై స్థానిక ఎన్సీపీ ఎమ్మెల్యే సునీల్ టింగ్రే చేస్తున్న ఆరోపణలను మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఖండించారు. అతడు తనపై చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని ఆయన స్పష్టం చేశారు. ఈ కారు ప్రమాదం కేసులో నిందితుడికి అనుకూలంగా వ్యవహారించాలంటూ పుణే పోలీసులను తాను ఆదేశించానంటూ పార్టీ ఎమ్మెల్యే సునీల్ టింగ్రే చేసిన ఆరోపణలపై శనివారం ముంబైలో అజిత్ పవార్ స్పందించారు.

Also Read: విమానానికి మళ్లీ బాంబు బెదిరింపు


మరోవైపు ఈ కారు ప్రమాదం సునీల్ టింగ్రే అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో చోటు చేసుకుందని ఆయన గుర్తు చేశారు. ఆ క్రమంలో ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని ఆయన సందర్శించారని తెలిపారు. అదీకాక ఈ కేసును ఎమ్మెల్యే సునీల్ టింగ్రే తొక్కి పెట్టే ప్రయత్నం చేస్తున్నారని అజిత్ పవార్ ఆరోపించారు. తనపై ఆయన అర్థం పర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. అయితే ఈ ప్రమాదం అనంతరం ఈ కేసు విషయంలో పుణే పోలీస్ కమిషనర్‌ అమితేష్ కుమార్‌కు తాను ఫోన్ చేసినట్లు ఎమ్మెల్యే సునీల్ ఆరోపణలపై సైతం అజిత్ స్పందించారు. పుణే పోలీస్ కమిషనర్‌కు వివిధ అంశాలపై తాను ఫోన్ కాల్ చేస్తానని.. కానీ ఈ కారు ప్రమాదం కేసుపై మాత్రం ఆయనతో మాట్లాడలేదని ఆయన స్పష్టం చేశారు.

Also Read: మోదీ బాటలోనే..


ఇక ఈ కారు ప్రమాదం అనంతరం పుణే పోలీస్ కమిషనర్‌‌కు సునీల్ టింగ్రే ఫోన్ చేసి ఉంటారని పేర్కొన్నారు. అదీకాక డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ హోం శాఖను పర్యవేక్షిస్తున్నారన్నారు. ఈ కేసు దర్యాప్తు నిష్పక్షపాతంగా జరపాలని ఆయన ఆదేశించారని గుర్తు చేశారు. అలాగే ఈ కేసు దర్యాప్తులో సీఎం ఏక్‌నాథ్ షిండే సైతం పలు కీలకమైన సూచనలు చేశారని అజిత్ పవర్ తెలిపారు. అయితే ఈ కేసు విషయంలో పోలీసులు ఆలస్యంగా స్పందించారని.. ఆ క్రమంలో వారిపై చర్యలు తీసుకున్నారన్నారు. అలాగే ఈ కేసులో రక్త నమూనాలు సేకరించే క్రమంలో వాటిని తారుమారు చేసిన వైద్యులపై ప్రభుత్వం చర్యలు తీసుకుందని అజిత్ పవార్ వివరించారు.

Also Read: ఓట్ల కౌంటింగ్‌‌కు పటిష్టమైన భద్రత ఏర్పాట్లు: సీఈఓ వికాస్‌రాజ్


అసలేం జరిగింది..!

మే 19వ తేదీన పుణేలోని కల్యాణ్ నగర్‌లో మద్యం సేవించిన మైనర్ కారు డ్రైవ్ చేశాడు. ఆ క్రమంలో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు టెక్కీలపైకి ఆ కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆ టెక్కీలు అక్కడికక్కడే మృతి చెందారు. ఇక ఈ కేసులో మైనర్‌ను తప్పించేందుకు అతడి కుటుంబం రంగంలోకి దిగింది. అందులోభాగంగా కారు డ్రైవర్‌ను ఈ కేసులో ఇరికించేందుకు ఆ కుటుంబం ప్రయత్నించింది. అందులోభాగంగా డ్రైవర్ కుటుంబాన్ని కిడ్నాప్ చేసేందుకు స్కెచ్ వేసింది.

దీంతో డ్రైవర్ పోలీసులను ఆశ్రయించాడు. దాంతో కారు ప్రమాదానికి కారణమైన మైనర్ తండ్రి విశాల్ అగర్వాల్, తాత సురేంద్ర అగర్వాల్‌‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక మైనర్ రక్త నమూనా సేకరించకుండా .. అతడి తల్లి రక్త నమూనాను వైద్యులు సేకరించారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో వైద్యులపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. మరోవైపు తాజాగా మైనర్ తల్లిని సైతం పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Updated Date - Jun 01 , 2024 | 04:22 PM

Advertising
Advertising