ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Lawrence Bishnoi: జైల్లో గ్యాంగ్‌స్టర్ ఇంటర్వ్యూ.. డీఎస్పీ సహా ఏడుగురు పోలీసులపై వేటు

ABN, Publish Date - Oct 26 , 2024 | 10:55 AM

అప్పట్లో తీవ్ర కలకలం రేపిన గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ఇంటర్వ్యూ వ్యవహారంపై పంజాబ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఓ నేరస్తుడిని ఇంటర్వ్యూ చేయడానికి పర్మిషన్ ఇచ్చిన పోలీసులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Lawrence Bishnoi

: కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్‌ను జైల్లోనే ఇంటర్వ్యూ చేసేందుకు అనుమతిచ్చిన పోలీసులపై సస్పెన్షన్ వేటు పడింది. పంజాబ్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న లారెన్స్ బిష్ణోయ్‌ ఇంటర్వ్యూ తీవ్రస్థాయిలో దుమారం రేపింది. ఈ వ్యవహారంతో సంబంధమున్న వారిపై పంజాబ్ హోం శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. సస్పెండ్ కు గురైన వారిలో ఇద్దరు డీఎస్పీలు సహా మొత్తం ఏడుగురు పోలీసులు ఉన్నారు. పంజాబ్ జైల్లో కస్టడీలో ఉన్న ఈ గ్యాంగ్‌స్టర్ ను 2022, ఏప్రిల్ 3న ఓ టీవీ చానెల్‌ ఇంటర్వ్యూ చేసింది. అప్పట్లో ఇది తీవ్ర కలకలం రేపింది. సామాన్య ప్రజల నుంచి సైతం దీనిపై వ్యతిరేకత వచ్చింది. దీంతో ఈ ఘటనపై పంజాబ్ హోం శాఖ చర్యలు తీసుకుంది. ఇంటర్వ్యూకు అనుమతిచ్చిన ఆనాటి డీఎస్పీ గురుషేర్ సింగ్‌తోపాటు మరో ఆరుగురు పోలీసు అధికారులను సస్పెండ్ చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ అయ్యాయి.


ఎవరీ లారెన్స్ బిష్ణోయ్

లారెన్స్‌ బిష్ణోయ్‌ 1993లో పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌ జిల్లా ధత్తరన్‌వాలిలో పుట్టాడు. ఇతడి తండ్రి హరియాణా పోలీస్‌ కానిస్టేబుల్‌. కృష్ణ జింకలను అమితంగా ఆరాధించే బిష్ణోయ్‌ వర్గానికి చెందిన లారెన్స్‌ చండీగఢ్‌లోని పంజాబ్‌ యూనివర్సిటీలో చదివే సమయంలో విద్యార్థి నాయకుడు. ఇదే కమ్రంలో గోల్డీ బ్రార్‌ పరిచయమై నేర సామ్రాజ్యంలోకి అడుగుపెట్టాడు. కాలేజీ గ్యాంగ్‌ వార్‌లో తన స్నేహితురాలిని సజీవ దహనం చేయడం.. లారెన్స్‌లో తీవ్ర కసిని పెంచింది. రాజస్థాన్‌లో కృష్ణ జింకలను చంపిన కేసులో నిందితుడైన సల్మాన్‌ఖాన్‌ను హత్య చేసేందుకు ప్రణాళిక వేయడం ద్వారా లారెన్స్‌ వార్తల్లోకెక్కాడు. ఇతడి గ్యాంగ్‌ కార్యకలాపాలు పంజాబ్‌, ఢిల్లీ, హరియాణా, రాజస్థాన్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లకు విస్తరించాయి.

Updated Date - Oct 26 , 2024 | 11:39 AM