ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Rahul Gandhi: రాహుల్ గాంధీ పోటీ చేసేది అక్కడి నుంచే.. కాంగ్రెస్ నేత క్లారిటీ

ABN, Publish Date - Mar 06 , 2024 | 04:20 PM

లోక్‌సభ ఎన్నికలు (Lok Sabha Elections) దగ్గర పడుతున్న తరుణంలో.. రాజకీయ పార్టీలన్నీ తమ అభ్యర్థులను ఫైనల్ చేసే పనిలో నిమగ్నమయ్యాయి. ఇప్పటికే బీజేపీ (BJP) 195 మందితో కూడిన అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేయగా.. ఇండియా కూటమి (India Alliance) ఇంకా సీట్ల సర్దుబాటు విషయంపై చర్చలు జరుపుతోంది. అయితే.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఈసారి ఏ స్థానం నుంచి పోటీ చేస్తారన్నది గత కొన్ని రోజుల నుంచి హాట్ టాపిక్‌గా మారింది.

లోక్‌సభ ఎన్నికలు (Lok Sabha Elections) దగ్గర పడుతున్న తరుణంలో.. రాజకీయ పార్టీలన్నీ తమ అభ్యర్థులను ఫైనల్ చేసే పనిలో నిమగ్నమయ్యాయి. ఇప్పటికే బీజేపీ (BJP) 195 మందితో కూడిన అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేయగా.. ఇండియా కూటమి (India Alliance) ఇంకా సీట్ల సర్దుబాటు విషయంపై చర్చలు జరుపుతోంది. అయితే.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఈసారి ఏ స్థానం నుంచి పోటీ చేస్తారన్నది గత కొన్ని రోజుల నుంచి హాట్ టాపిక్‌గా మారింది. తన కంచుకోట అయిన అమేఠీ (Amethi) నుంచే పోటీ చేస్తారా? లేక గత ఎన్నికల్లో పరాభావం ఎదురైన తరుణంలో మరో స్థానం నుంచి బరిలోకి దిగుతారా? అనే సస్పెన్స్ నెలకొంది.


తాజాగా ఈ సస్పెన్స్‌కు తెరపడింది. రాహుల్ గాంధీ ఈ ఎన్నికల్లోనూ అమేఠీ నుంచే బరిలోకి దిగనున్నారని స్పష్టత వచ్చింది. ఈ విషయాన్ని ఆ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రదీప్ సింఘాల్ (Pradeep Singhal) తెలిపారు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని వెల్లడించారు. తన ఢిల్లీ పర్యటనను ముగించుకొని వచ్చిన తర్వాత ప్రదీప్ ఈ విషయాన్ని వెల్లడించడం గమనార్హం. అయితే.. దీనిపై పార్టీ హైకమాండ్ (Congress) నుంచి ఎలాంటి సమాచారం లేదు. ఒకవేళ ప్రదీప్ చెప్పినట్లు రాహుల్ ఈసారి అమేఠీ నుంచి బరిలోకి దిగితే.. మరోసారి బలమైన పోటీ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే.. కేంద్రమంత్రి స్మృతి ఇరానీ (Smriti Irani) కూడా అమేఠీ నుంచే పోటీ చేస్తున్నారు. ఇటీవల బీజేపీ ప్రకటించిన తొలి జాబితాలో ఆమె స్థానం సంపాదించుకున్నారు.

కాగా.. అమేఠీ స్థానం కాంగ్రెస్‌కు కంచుకోట. 1967లో ఆ స్థానం ఏర్పడినప్పటి నుంచి 2019 దాకా.. కాంగ్రెస్ అభ్యర్థులే అక్కడ విజయం సాధిస్తూ వచ్చారు. సంజయ్ గాంధీ రెండుసార్లు, రాజీవ్ గాంధీ మూడుసార్లు, సోనియా గాంధీ ఒకసారి ఈ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఇక రాహుల్ గాంధీ 2002 నుంచి 2019 వరకు అమేఠీ నుంచి పోటీ చేసి గెలిచారు. కానీ.. 2019 ఎన్నికల్లో మాత్రం స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు. అయితే.. 2014 ఎన్నికల్లో మాత్రం స్మృతి ఇరానీ ఓటమిపాలయ్యారు. ఇప్పుడు 2024లో రాహుల్ ఇక్కడి నుంచి బరిలోకి దిగితే.. పోటీ రసవత్తరంగా ఉండబోతుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 06 , 2024 | 04:20 PM

Advertising
Advertising