ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Rahul Gandhi: 15 రాష్ట్రాలు, 6700 కి.మీ..మరో యాత్రకు రాహుల్ గాంధీ శ్రీకారం

ABN, Publish Date - Jan 04 , 2024 | 05:03 PM

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) మరో యాత్రతో ప్రజల ముందుకు వస్తున్నారు. ఇదివరకు భారత్ జోడో యాత్ర చేపట్టగా.. ఇప్పుడు భారత్ జోడో న్యాయ్ యాత్ర చేపట్టనున్నారు. 15 రాష్ట్రాల గుండా, 67 రోజుల పాటు యాత్ర కొనసాగుతోంది.

న్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికలకు సమయం సమీపిస్తోన్న వేళ ప్రధాన పార్టీలు ప్రచారంపై దృష్టిసారించాయి. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) మరో యాత్రతో ప్రజల ముందుకు వస్తున్నారు. ఇప్పటికే భారత్ జోడో యాత్ర చేపట్టగా.. ఆ పార్టీకి బూస్టింగ్ ఇచ్చింది. ఆ యాత్ర వల్ల కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇదివరకు దక్షిణ భారతదేశం నుంచి ఉత్తర భారతదేశానికి భారత్ జోడో యాత్ర చేపట్టగా.. ఇప్పుడు తూర్పు నుంచి పడమరకు భారత్ జోడో న్యాయ్ యాత్ర చేపట్టనున్నారు. ఈ నెల 14వ తేదీన రాహుల్ గాంధీ యాత్ర ప్రారంభం అవుతుంది. 15 రాష్ట్రాల గుండా, 67 రోజుల పాటు యాత్ర కొనసాగుతోంది. 6700 కిలోమీటర్ల మేర రాహుల్ గాంధీ (Rahul Gandhi) పర్యటిస్తారు.

జోడో ఎందుకంటే..?

గత ఏడాది కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 4 వేల కిలోమీటర్ల మేర భారత్ జోడో యాత్రను రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేపట్టారు. 136 రోజుల పాటు ఆ యాత్ర కొనసాగింది. ఇప్పుడు భారత్ జోడో న్యాయ్ యాత్ర చేపడుతున్నారు. యాత్ర పేరు ముందు భారత్ న్యాయ్ యాత్ర అని ఉండేది. తర్వాత దానికి జోడో చేర్చారు. మొదటి యాత్రకు జోడో చేపట్టడంతో సెంటిమెంట్ వర్కవుట్ అయ్యింది. రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టింది. ఇప్పుడు దానినే ఫాలో అవుతున్నారు. అలాగే ముందు 14 రాష్ట్రాల్లో యాత్రను షెడ్యూల్ చేశారు. ఇప్పుడు మరో రాష్ట్రాన్ని చేర్చారు. దీంతో పర్యటించే కిలోమీటర్లు కూడా 6200 నుంచి 6700కు పెరిగాయి.

ఇండియా కూటమి పార్టీలు పాల్గొంటాయా..?

భారత్ న్యాయ్ జోడో యాత్ర 110 జిల్లాల గుండా 100 లోక్ సభ నియోజకవర్గాలతో సాగనుంది. ఇందులో 337 అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా కలుస్తాయి. రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేపట్టే యాత్రలో పాల్గొనాలని ఇండియా కూటమి పార్టీలను కోరామని కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. చిన్న పార్టీలు, స్వచ్చంద సంస్థలు కూడా పాల్గొనాలని కోరామని తెలిపింది. భారత్ జోడో యాత్రలో ఆర్థిక అసమానతలు, నియంతృత్వం గురించి రాహుల్ గాంధీ ప్రధానంగా ప్రస్తావించారు. ఇప్పుడు చేపట్టే యాత్రలో సామాజిక, ఆర్థిక అంశాలు గురించి లేవనెత్తుతారని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ (Jairam Ramesh) తెలిపారు.

Updated Date - Jan 04 , 2024 | 05:08 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising