ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రైల్వేలో రిటైర్‌ అయిన వాళ్లకు మళ్లీ ఉద్యోగాలు

ABN, Publish Date - Oct 20 , 2024 | 05:35 AM

రిటైర్డ్‌ ఉద్యోగులకు రైల్వే బోర్డు మళ్లీ ఉద్యోగాలు ఇవ్వనుంది. రైల్వేలలో సిబ్బంది కొరత పెద్ద సమస్యగా మారడంతో ఈ నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా వివిధ జోన్లలో 25

సిబ్బంది కొరతతో రైల్వే బోర్డు నిర్ణయం

న్యూఢిల్లీ, అక్టోబరు 19: రిటైర్డ్‌ ఉద్యోగులకు రైల్వే బోర్డు మళ్లీ ఉద్యోగాలు ఇవ్వనుంది. రైల్వేలలో సిబ్బంది కొరత పెద్ద సమస్యగా మారడంతో ఈ నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా వివిధ జోన్లలో 25 వేల ఖాళీల భర్తీకి రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌ ప్రారంభించింది. 65 ఏళ్ల లోపు వయసు గల రైల్వే రిటైర్డ్‌ ఉద్యోగులను సూపర్‌వైజర్లు, ట్రాక్‌మెన్‌లుగా తాత్కాలికంగా విధుల్లోకి తీసుకోనుంది. తమ సర్వీసులో చివరిసారి తీసుకున్న జీతం ఇవ్వడంతో పాటు ట్రావెల్‌ అలవెన్స్‌లు, అధికారిక టూర్లు వంటి ప్రయోజనాలు ఉంటాయి. అయితే జీతంలో పెరుగుదల లేదా ఇతర అదనపు ప్రయోజనాలు ఉండవు. పదవీకాలం రెండేళ్ల పాటు ఉంటుంది. అవసరాన్ని బట్టి పదవీకాలాన్ని పొడిగించే అవకాశముంటుంది. రైల్వే ప్రమాదాలు, ఉద్యోగులపై పని ఒత్తిడి పెరగడంతో సమస్య పరిష్కారానికి త్వరితగతిన రిటైర్డ్‌ ఉద్యోగులను తీసుకోవాలని నిర్ణయించారు.

Updated Date - Oct 20 , 2024 | 05:35 AM