ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Rains: రాష్ట్రంలో ఐదు రోజులపాటు తేలికపాటి వర్షాలు

ABN, Publish Date - Jan 05 , 2024 | 08:15 AM

రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లోనూ, పుదుచ్చేరి, కారైక్కాల్‌ ప్రాంతంలో శుక్ర, శనివారాల్లో తేలికపాటి వర్షపు జల్లులు పడే అవకాశం ఉందని చెన్నై వాతావారణ కేంద్రం తెలిపింది.

అడయార్‌(చెన్నై): రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లోనూ, పుదుచ్చేరి, కారైక్కాల్‌ ప్రాంతంలో శుక్ర, శనివారాల్లో తేలికపాటి వర్షపు జల్లులు పడే అవకాశం ఉందని చెన్నై వాతావారణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా తేని, దిండిగల్‌, నీలగిరి(Theni, Dindigal, Nilgiris) జిల్లాల్లో వర్షం పడుతుందని ప్రకటించింది. కాగా ఈనెల 6న కోస్తాతీర జిల్లాల్లోని అనేక ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కన్నియాకుమారి, తిరునెల్వేలి, తెన్‌కాశి, విరుదునగర్‌, పుదుక్కోట, తంజావూరు, తిరువారూరు, నాగపట్టణం, మైలాడుదురై జిల్లాల్లోను, పుదుచ్చేరి, కారైక్కాల్‌(Karaikkal, Puducherry) ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అదేవిధంగా ఈ నెల 7, 8 తేదీల్లో తిరువళ్ళూరు, చెన్నై, కాంచీపురం జిల్లాల్లో భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఇదిలా వుండగా గురువారం వర్షం చెన్నైని తడిపేసింది.

ఊటీ, కున్నూరు ప్రాంతాలను కప్పేసిన మంచు

ప్రముఖ పర్యాటక ప్రాంతాలు ఊటీ, కున్నూరు, గూడలూరు(Ooty, Coonoor, Gudalur) ప్రాంతాల్లో గురువారం వేకువజాము దట్టమైన మంచు అలముకుంది. జననివాస ప్రాంతాలు, తేయాకు తోటలు, పండ్ల తోటలు, పూల తోటలను మంచు దట్టంగా కప్పేసింది. ఈ మూడు ప్రాంతాల్లోనూ రహదారులు తెలియనంతగా దట్టమైన మంచు కురిసింది. దీనితో వాహన చోదకులు దారి తెలియక తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఊటీ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న వారంతా తీవ్రమైన చలితో వణకిపోతున్నారు.

Updated Date - Jan 05 , 2024 | 08:15 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising