ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Rajasthan: సజీవ దహనానికి యత్నం.. రైతుపై రూ. 9.91 లక్షల జరిమానా!

ABN, Publish Date - Dec 22 , 2024 | 06:36 PM

తమ భూమికి పరిహారం కోరుతూ సజీవ దహనానికి ప్రయత్నించిన రైతుపై రాజస్థాన్ పోలీసులు ఏకంగా రూ.9.91 లక్షల జరిమానా విధించారు.

ఇంటర్నెట్ డెస్క్: తమ భూమికి పరిహారం కోరుతూ సజీవ దహనానికి ప్రయత్నించిన రైతుపై రాజస్థాన్ పోలీసులు ఏకంగా రూ.9.91 లక్షల జరిమానా విధించారు. ఈ మేరకు నోటీసులు పంపించిన పోలీసులు వారంలోగా రైతు స్పందించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు (Rajasthan).

GST Council Meet: పాప్‌కార్న్ సహా పలు వస్తువులపై జీఎస్టీ బాదుడు..

స్థానిక మీడియా కథనాల ప్రకారం, ఝుంఝ్నూ జిల్లాకు చెందిన రైతు విద్యాధర్ యాదవ్, ఆయన కుటుంబసభ్యులు తమ భూమి తీసుకున్న శ్రీ సిమెంట్ కంపెనీ నుంచి పరిహారం కోరుతూ డిసెంబర్ 10న నిరసనకు దిగారు. నడిరోడ్డుపై చితి పేర్చుకుని సజీవ దహనానికి యత్నించారు. వారి ప్రయత్నాన్ని అడ్డుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. భారీగా బందోబస్తు ఏర్పాటు చేసి రైతు కుటుంబం యత్నాన్ని విఫలం చేశారు.

Jaipur Literature Festival: ప్రపంచ సాహిత్య మహా కుంభమేళాకు కౌంట్‌డౌన్


అయితే, రైతు కుటుంబం ప్రయత్నాన్ని అడ్డుకునేందుకు ప్రభుత్వంపై ఆర్థిక భారం పడటంతో ఆ మొత్తం చెల్లించాలంటూ విద్యాధర్ యాదవ్‌కు నోటీసులు పంపించారు. నిరసనను అదుపు చేసేందుకు ఏఎస్పీ, డీఎస్పీ సహా 99 మంది పోలీసులను మోహరించాల్సి వచ్చిందని తమ నోటీసుల్లో పేర్కొన్నారు. పోలీసు వాహనాలను కూడా ఏర్పాటు చేయాల్సి వచ్చిందని చెప్పారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వ ఖజానాపై ఆర్థిక భారం పడిందన్నారు. కాబట్టి, సదరు రైతు రూ.9,91,577 నగదును ఎస్పీ కార్యాలయం అకౌంట్స్ బ్రాంచ్‌లో జమ చేయాలని ఆదేశించారు. ఈ మొత్తం చెల్లించని పక్షంలో చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Amit Shah: యాంటీ డ్రోన్ విభాగంతో శత్రు దుర్భేద్యంగా సరిహద్దులు


అయితే, రైతు నిరసనల నేపథ్యంలో సిమెంట్ కంపెనీ పరిహారం కింద రూ.3 కోట్లు చెల్లించేందుకు అంగీకరించింది. ఈలోపు పోలీసులు ఇలా నోటీసులు జారీ చేయడంతో రైతు కుటుంబానికి షాక్ తగిలింది. ఈ అంశంపై జిల్లా ఎస్పీ మాట్లాడుతూ నిబంధనల ప్రకారమే నోటీసులు జారీ చేశామని పేర్కొన్నారు. రైతుకు ఏడు రోజుల సమయం కూడా ఇచ్చినట్టు చెప్పారు. అయితే, సజీవ దహనానికి యత్నించిన కేసులో ఇంతటి జరిమానా విధించడం రాష్ట్రంలో ఇదే తొలిసారి కావడంతో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.

Read More National News and Latest Telugu News

Updated Date - Dec 22 , 2024 | 06:36 PM