Rajnath Singh: ఎయిమ్స్ నుంచి రాజ్‌నాథ్ సింగ్ డిశ్చార్జి
ABN, Publish Date - Jul 13 , 2024 | 06:23 PM
వెన్నునొప్పి కారణంగా ఎయిమ్స్ లో చేరిన కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శనివారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. రెండ్రోజుల క్రితం ఆయన వెన్నునొప్పి కారణంగా ఆసుపత్రిలోని న్యూరోసర్జరీ విభాగంలో చేరారు.
న్యూఢిల్లీ: వెన్నునొప్పి (Back pain) కారణంగా ఎయిమ్స్ (AIIMS)లో చేరిన కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) శనివారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. రెండ్రోజుల క్రితం ఆయన వెన్నునొప్పి కారణంగా ఆసుపత్రిలోని న్యూరోసర్జరీ విభాగంలో చేరారు. నొప్పి తీవ్రతను గుర్తించి చికిత్స అందించామని, ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని ఎయిమ్స్ మెడికల్ సెల్ ఇన్‌చార్జి డాక్టర్ రీమా దాదా తెలిపారు.
Sanjay Raut on Emergency: వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నా ఎమర్జెన్సీ విధించి ఉండేవారు..
రాజ్‌నాథ్ సింగ్ మూడ్రోజుల క్రితమే 73వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయనకు మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కరోఠ శ్రమ, సేవాభావంతో ప్రజల మన్ననలను రాజ్‌నాథ్ అందుకున్నారని, రక్షణ శాఖ మంత్రిగా భారతదేశ రక్షణ సంపత్తిని పటిష్టం చేయడంలో ముందున్నారని అన్నారు. రాజ్‌నాథ్ సింగ్ చిరకాలం ఆయురార్యోగాలతో ఉండాలని తన సందేశంలో మోదీ అభిలషించారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన రాజ్‌నాథ్ ఆర్ఎస్ఎస్ విద్యార్థి విభాగమైన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ సభ్యుడిగా తన కెరీర్ ప్రారంభించి, ఆ తర్వాత బీజేపీ యువజన విభాగంలో చేరారు. వివాదరహితుడిగా పేరున్న ఆయన ప్రస్తుతం లక్నో లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వరుసగా రెండోసారి రక్షణ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 2014లోనూ మోదీ తొలి మంత్రివర్గంలో క్యాబినెట్ మంత్రిగా పనిచేశారు. 1977-80, 2001-2003 వరకూ ఉత్తరప్రదేశ్ ఎమ్మెల్యేగా, 1991 నుంచి 1992 వరకూ యూపీ విద్యాశాఖ మంత్రిగా, 1999 నుంచి 2000 వరకూ కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రిగా ఆయన పనిచేశారు. 2000-2002లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా సేవలందించారు. 2003లో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు.
For Latest News and National News click here
Updated Date - Jul 13 , 2024 | 06:23 PM