ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Rajnath Singh: ఎవరైనా భారత్ జోలికొస్తే.. చైనాని ఉద్దేశించి రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక

ABN, Publish Date - Mar 07 , 2024 | 07:19 PM

కొన్నేళ్లుగా చైనా సరిహద్దులో (China Border) నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో.. కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరైనా భారత్ (India) జోలికి వస్తే.. అందుకు ధీటుగా బదులిచ్చేందుకు సాయుధ బలగాలు సిద్ధంగా ఉన్నాయని అన్నారు. సవాళ్లు ఏ రూపంలో ఎదురైనా.. వేగంగా, సమర్ధవంతంగా స్పందించేందుకు భారత్ రెడీగా ఉందని తెలిపారు.

కొన్నేళ్లుగా చైనా సరిహద్దులో (China Border) నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో.. కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరైనా భారత్ (India) జోలికి వస్తే.. అందుకు ధీటుగా బదులిచ్చేందుకు సాయుధ బలగాలు సిద్ధంగా ఉన్నాయని అన్నారు. సవాళ్లు ఏ రూపంలో ఎదురైనా.. వేగంగా, సమర్ధవంతంగా స్పందించేందుకు భారత్ రెడీగా ఉందని తెలిపారు. చివరికి శాంతి సమయంలో కూడా యుద్ధానికి సంసిద్ధతతో ఉండాలని పేర్కొన్నారు. జాతీయ మీడియా సంస్థ ఎన్డీటీవీ నిర్వహించిన తొలి డిఫెన్స్ సమ్మిట్‌లో (NDTV Defence Summit) ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.


2014లో ప్రధాని మోదీ (PM Modi) ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. రక్షణ రంగానికి తాము ప్రధాన ప్రాధాన్యం ఇచ్చామని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. తాము అనేక మేక్-ఇన్-ఇండియా (Make in India) కార్యక్రమాలను ప్రవేశపెట్టామని, తమ దృష్టి సైనిక ఆధునికీకరణపైనే ఉందని చెప్పారు. భూమి, గగనతలం లేదా సముద్రం నుంచి ఎవరైనా భారతదేశంపై దాడికి దిగి.. మన బలగాలు చాలా శక్తివంతంగా స్పందిస్తాయని అన్నారు. తాము ఎవరి భూమిని కబ్జా చేయలేదని, కానీ ఎవరైనా భారత్‌పై దాడి చేస్తే మాత్రం వాళ్లకు ధీటుగా సమాధానం చెప్పగలిగే స్థితిలో ఉన్నామని తెలిపారు. గత ప్రభుత్వాలు రక్షణ రంగానికి పెద్దపీట వేయలేదని తాను అనడం లేదని, కానీ తాము రక్షణ రంగంలో ఆత్మనిర్భర్తను తీసుకొచ్చామని పేర్కొన్నారు.

భారతదేశ దృక్కోణం నుండి రక్షణ రంగాన్ని బలోపేతం చేశామని.. ఫలితంగా అంతర్జాతీయ వేదికలపై భారత్‌ దూసుకుపోతోందని రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారడమే కాదు.. మన సైనిక బలం ప్రపంచంలోనే గొప్పగా ఉండే రోజు ఎంతో దూరంలో లేదన్నారు. ఇదే సమయంలో గల్వాన్‌లో చైనాల బలగాలతో చోటు చేసుకున్న ఘర్షణను ప్రస్తావించిన ఆయన.. ఆ సమయంలో భారత సైన్యం చూపించిన తెగువను మెచ్చుకున్నారు. మనది ఇప్పుడు బలహీన దేశం కాదని ఉద్ఘాటించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 07 , 2024 | 07:20 PM

Advertising
Advertising