ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Ram: నా పేరులోనే రాముడు ఉన్నాడు.. నటుడు రజా అలీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

ABN, Publish Date - Jan 06 , 2024 | 02:01 PM

రామ మందిరంలో రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠాపన మహోత్సవానికి గుర్తుగా రామనగరి అయోధ్య సన్నద్ధమవుతోంది.

రామ మందిరంలో రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠాపన మహోత్సవానికి గుర్తుగా రామనగరి అయోధ్య సన్నద్ధమవుతోంది. భక్తి పారవశ్యంతో పులకరిస్తోంది. రామమందిర ప్రారంభోత్సవం కోసం యావత్ దేశం ఆత్రంగా ఎదురు చూస్తోంది. ఈ తరుణంలో కొందరు సెలబ్రిటీలు చేస్తున్న కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి. తాజాగా ప్రముఖ నటుడు రజా అలీ మురాద్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారుతున్నాయి. రాముడు ఎల్లప్పుడూ తనను ఆశీర్వదిస్తూనే ఉంటాడన్న ఆయన.. తన పేరులోనే రాముడు ఉన్నాడని చెప్పాడు. తన పేరులోని మొదటి అక్షరాలను కలిపితే రామ్ అనే అర్థం వస్తుందని అన్నాడు. శ్రీరాముడి ఆశీస్సులతోనే రామ్ తేరి గంగా మైలీ ఫిల్మ్ తన కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ అని కొనియాడారు.

కాగా.. జనవరి 22న అయోధ్యలో దీపావళి పండుగ జరుపుకోవాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఇళ్లలో ప్రత్యేక దీపాలు, శ్రీరామజ్యోతి వెలిగించాలని కోరారు. శ్రీరామ జన్మభూమి మందిరం ప్రారంభోత్సవానికి ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోందని ప్రధాని అన్నారు. అదృష్టవశాత్తూ ఈ చారిత్రాత్మక ఘట్టం మన జీవితాల్లోకి వచ్చింది. దేశం కోసం కొత్త సంకల్పాన్ని ఏర్పరచుకోవాలి. ఇందుకోసం 140 కోట్ల మంది జనవరి 22న తమ ఇళ్లలో శ్రీరామజ్యోతిని వెలిగించాలని పీఎం నరేంద్ర మోడీ అన్నారు.


సాంప్రదాయ నాగర శైలిలో నిర్మించిన రామాలయం 380 అడుగుల పొడవు, 250 అడుగుల వెడల్పు, 161 అడుగుల ఎత్తు ఉంటుంది. ఆలయంలోని ఒక్కో అంతస్తు 20 అడుగుల ఎత్తులో ఉంటుంది. మొత్తం 392 స్తంభాలు, 44 ద్వారాలు ఉన్నాయి.

మహా సంప్రోక్షణ వేడుకలకు ముందు, ప్రధాని మోదీ కొత్తగా నిర్మించిన అయోధ్య ఎయిర్‌పోర్టును ప్రారంభించారు , అయోధ్య రైల్వే స్టేషన్‌ను తిరిగి అభివృద్ధి చేశారు మరియు కొత్త అమృత్ భారత్ రైళ్లు మరియు వందే భారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు.

"మరిన్ని వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి"

Updated Date - Jan 06 , 2024 | 02:01 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising