ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Madhya Pradesh: రామభక్తుల ఊరేగింపుపై రాళ్లతో దాడి, సెక్షన్ 144 అమలు

ABN, Publish Date - Jan 09 , 2024 | 03:49 PM

అయోధ్య రామాలయంలో రామ్ లల్లా ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని పురస్కరించుకుని రామభక్తులు జరిపిన ఊరేగింపుపై ఒక వర్గం వారు రాళ్లు, కత్తులతో దాడి చేయడం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. మధ్యప్రదేశ్‌ లోని షాజపూర్‌లో సిటీలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో 144 సెక్షన్ కింద జిల్లా యంత్రాగం మంగళవారంనాడు నిషేధాజ్ఞలు విధించింది.

షాజపూర్‌: అయోధ్య రామాలయంలో రామ్ లల్లా ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని పురస్కరించుకుని రామభక్తులు జరిపిన ఊరేగింపుపై (Ram temple procession) ఒక వర్గం వారు రాళ్లు, కత్తులతో దాడి చేయడం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh)లోని షాజపూర్‌లో సిటీలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో 144 సెక్షన్ కింద జిల్లా యంత్రాగం మంగళవారంనాడు నిషేధాజ్ఞలు విధించింది. జిల్లాలోని మగరియ, కచ్చివాడ, లాల్‌పురలో తక్షణం ఈ నిషేధాజ్ఞలు అమల్లోకి వచ్చాయి. భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరించామని షాజాపూర్ కలెక్టర్ రిజు బఫ్నా తెలిపారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని, దాడికి దిగిన దుండగులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.


సంఘటన వివరాల ప్రకారం, సోమవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో నాగ్-నగిన్ రోడ్డు సమీపంలోని ఒక మసీదు వద్ద రామభక్తుల ఊరేగింపును ఏడెనిమిది మంది వ్యక్తులు అడ్డుకున్నారు. తమ ప్రాంతం నుంచి ఊరేగింపు తీయరాదంటూ అడ్డుకోవడంతో ఆ వర్గానికి చెందిన మరికొందరు అక్కడికి చేరుకున్నారు. ఊరేగింపు తీసిన వారిపై దాడికి దిగడంతో పాటు రాళ్లు రువ్వారు. కాగా, తమపై కత్తులతో దాడులు చేయడంతో పాటు ఇళ్ల పైనుంచి రాళ్లు రువ్వినట్టు ఊరేగింపులో పాల్గొన్న మోహిత్ రాథోడ్ ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దాడికి పాల్పడిన 24 మందిని గుర్తించారు. మరో 15 నుంచి 20 మంది గుర్తుతెలియని వ్యక్తులపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఘటనా స్థలికి చేరుకున్న ఉజ్జయిన్ డివిజనల్ కమిషనర్ సంజయ్ గోయెల్, ఐజీ సంతోష్ కుమార్ సింగ్ పరిస్థితిని సమీక్షించారు. ఘటన అనంతరం సాజాపూర్ ఎమ్మెల్యే అరుణ్ భీమవాడ్ స్థానిక పోలీసు స్టేషన్‌కు వెళ్లి దుండగులపై చర్య తీసుకోవాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు.

Updated Date - Jan 09 , 2024 | 03:49 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising