ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Ratan Tata: రతన్ టాటా విజయ రహస్యాలు ఇవే..

ABN, Publish Date - Oct 10 , 2024 | 09:43 AM

ప్రతి రంగంలోనూ తనదైన ముద్ర వేయడమే కాకుండా ప్రతి వ్యక్తి హృదయంలో చోటు సంపాదించారు. వ్యాపారం చేసి సంపాదించడమే కాదు. సంపాదనలో ఎక్కువ భాగాన్ని సేవా కార్యక్రమాలకు విరాళాలుగా ఇచ్చిన వ్యక్తి రతన్ టాటా. ఆయనలో గొప్ప మానవతావాది కనిపిస్తారు. పోటీ ప్రపంచంలో వేరే వాళ్లను తొక్కి తాను ఎదగాలని ఎప్పుడూ..

Ratan Tata

రతన్ టాటా అంటే గుర్తొచ్చేది టాటా సంస్థలు, ఆయన వ్యాపార సామ్రాజ్యం. నమ్మకం, విశ్వసనీయతకు మారు పేరు. ఆయన కేవలం ఒక్కరోజులో విజయాన్ని సాధించలేదు. రతన్ టాటా ప్రపంచ దిగ్గజ వ్యాపారవేత్తగా ఎదగడానికి ఎన్నో కారణాలు. ఆయన శ్రమ, ఆలోచనలే టాటాను ఇంతటివారిని చేశాయి. ఎంత ఎత్తుకు ఎదిగినా గర్వం లేకపోవడం, విజయం సాధించామని పొంగిపోవడం రతన్ టాటాకు తెలియదు. ప్రపంచంలో ఎంతో మంది వ్యాపార వేత్తలు ఉన్నారు. కానీ వారిలో కొందరిని మాత్రమే సమాజం గుర్తించుకుంటుంది. ప్రతి రంగంలోనూ తనదైన ముద్ర వేయడమే కాకుండా ప్రతి వ్యక్తి హృదయంలో చోటు సంపాదించారు. వ్యాపారం చేసి సంపాదించడమే కాదు. సంపాదనలో ఎక్కువ భాగాన్ని సేవా కార్యక్రమాలకు విరాళాలుగా ఇచ్చిన వ్యక్తి రతన్ టాటా. ఆయనలో గొప్ప మానవతావాది కనిపిస్తారు. పోటీ ప్రపంచంలో వేరే వాళ్లను తొక్కి తాను ఎదగాలని ఎప్పుడూ ఆశించలేదు. తన కొత్త ఆలోచనలతో, కొత్త ఆవిష్కరణలతో ముందుదకెళ్లారు. టాటా సంస్థలు విస్తరించని రంగమంటూ లేదనే చెప్పుకోవాలి. ఏదైనా కొత్త ఉత్పత్తులను ప్రారంభించినప్పుడు విఫలమైనా నిరాశ చెందకుండా.. మార్పులు, చేర్పులు చేసుకుంటూ ముందుకెళ్లడంతోనే రతన్ టాటా ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించారు. రతన్ టాటా తక్కువ కాలంలో విజయవంతంగా ఎదగడానికి గల కొన్ని విషయాలను తెలుసుకుందాం.


ప్రజలతో అనుసంధానం..

రతన్ టాటా ఆలోచనలు ప్రజలతో అనుసంధానమయ్యేవిగా ఉండటమే ఆయన విజయవంతమైన వ్యాపార దిగ్గజంగా ఎదగడానికి కారణమైంది. సమాజాన్ని అర్థం చేసుకుంటూ.. ఎప్పుడు ఏది అవసరమో గ్రహించి.. సకాలంలో మార్కెట్‌లోకి అందుబాటులోకి తీసుకురావడంతో ప్రజలు టాటా ఉత్పత్తులవైపు ఆకర్షితులయల్యేవారు. ముఖ్యంగా సామాన్య, మధ్య తరగతి ప్రజలను దృష్టిలో పెట్టుకునేవారు. అందరికీ అందుబాటు ధరలో ఉండేలా చర్యలు తీసుకోవడమే ఆయన విజయ రహస్యాల్లో ఒకటి. ప్రజలకు ఏది అవసరమో ఆ ఉత్పత్తుల తయారీపై దృష్టి పెట్టడంతో టాటా ప్రొడక్ట్స్‌కు విపరీతమైన డిమాండ్ పెరిగింది. వీటన్నింటికి నిదర్శనం టాటా నానో కారు. లక్ష రూపాయలకు కారు అందించాలనే ఆలోచన ఆరోజుల్లో ప్రజలను ఆకర్షించింది. ఎలక్ట్రిక్ వస్తువులు మొదలుపెట్టి నిత్యావసర వస్తువుల వరకు ప్రతి విభాగానికి టాటా సంస్థ విస్తరించింది. తన సంపాదనలో కొంతభాగాన్ని సామాజిక సేవా కార్యక్రమాలకు వెచ్చించడం ప్రజలను బాగా ఆకర్షించింది. దీంతో టాటా ఉత్పత్తులను కొనేందుకు ఆసక్తి చూపించేవారు. తన సంస్థలో ఉద్యోగులతో స్నేహ పూర్వకంగా ఉండేవారు. తాను బాస్ అనే తరహాలో వ్యవహరించేేవారు కాదు. ఇవ్వన్నీ కలిసి ఆయనను వ్యాపార రంగంలో ఉన్నత స్థితిలో నిలబెట్టిందని చెప్పుకోవచ్చు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Oct 10 , 2024 | 09:43 AM