ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

‘జై భవాని’, ‘హిందూ’ తొలగించం

ABN, Publish Date - Apr 22 , 2024 | 03:32 AM

శివసేన (యూబీటీ) గేయం నుంచి ‘జై భవాని’, ‘హిందూ’ పదాలను తొలగించేది లేదని ఆ పార్టీ అధినేత, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే స్పష్టం చేశారు.

పార్టీ గేయాన్ని మార్చబోం.. ఈసీకి స్పష్టం చేసిన ఉద్ధవ్‌

‘జై బజరంగబలీ’ అంటూ ఓటేయాలని

మోదీ పిలుపునిచ్చినప్పుడు మీరేం చేశారు?

ఉచిత అయోధ్య యాత్ర పేరిట బీజేపీకి షా ఓట్లు అడగలేదా?

మతం పేరుతో ఓట్లడిగేందుకు వీలుగా చట్టాలు మార్చేశారా?

ఎన్నికల సంఘానికి ఉద్ధవ్‌ ఠాక్రే ప్రశ్నలు

ముంబై, ఏప్రిల్‌ 21: శివసేన (యూబీటీ) గేయం నుంచి ‘జై భవాని’, ‘హిందూ’ పదాలను తొలగించేది లేదని ఆ పార్టీ అధినేత, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే స్పష్టం చేశారు. ఆ పదాలను తొలగించాలంటూ ఎన్నికల కమిషన్‌(ఈసీ) నుంచి నోటీసు అందిందని, కానీ ఆ ఆదేశాలను పాటించబోమని స్పష్టం చేశారు. ఆ పదాలను తొలగించాలని ఆదేశించడం మహారాష్ట్రను అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన ఇక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘తుల్జా భవానీ అమ్మవారి ఆశీస్సులతో ఛత్రపతి శివాజీ హైందవీ స్వరాజ్‌ను స్థాపించారు. అమ్మవారి పేరు మీద కానీ హిందూ మతం పేరుతో కానీ మేం ఓట్లు అడగడం లేదు. కానీ ఆ పదాలను తొలగించాలంటే సహించేది లేద’ని పేర్కొన్నారు. బహిరంగ సభల్లో తాను ‘జై భవాని’, ‘జై శివాజీ’ అని నినదించే సంప్రదాయాన్ని కొనసాగిస్తానని తెలిపారు.

Updated Date - Apr 22 , 2024 | 03:32 AM

Advertising
Advertising