ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Reshuffle of Governors: ఈ రాష్ట్రాల్లో త్వరలో గవర్నర్ల బదిలీలు..

ABN, Publish Date - Oct 17 , 2024 | 04:12 PM

కేంద్ర ప్రభుత్వం అక్టోబర్, నవంబర్ నెలల్లో పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల గవర్నర్లను బదిలీ చేసే అవకాశం ఉంది. అనేక రాష్ట్రాల్లో గవర్నర్‌లు, లెఫ్టినెంట్ గవర్నర్‌లు ఇప్పటికే మూడు నుంచి ఐదు సంవత్సరాలకు పైగా పనిచేసినందునా బదిలీల ప్రక్రియ జరపాలని నిర్ణయించినట్లు తెలిసింది.

ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం అక్టోబర్, నవంబర్ నెలల్లో పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల గవర్నర్లను బదిలీ చేసే అవకాశం ఉంది. అనేక రాష్ట్రాల్లో గవర్నర్‌లు, లెఫ్టినెంట్ గవర్నర్‌లు ఇప్పటికే మూడు నుంచి ఐదు సంవత్సరాలకు పైగా పనిచేసినందునా బదిలీల ప్రక్రియ జరపాలని నిర్ణయించినట్లు తెలిసింది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, కేరళ, జమ్మూ కాశ్మీర్, కేంద్ర పాలిత ప్రాంతాలైన అండమాన్ నికోబార్ దీవులు, దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూలలో గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు మారనున్నారు. జమ్మూ కశ్మీర్‌లో లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా నాలుగేళ్లకు పైగా పదవిలో ఉన్నారు.

సిన్హా స్థానంలో ఆర్‌ఎస్‌ఎస్‌తో సంబంధాలున్న, అసెంబ్లీ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించిన బీజేపీ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్‌ను భర్తీ చేసే అవకాశం ఉందని ఊహాగానాలు జోరందుకున్నాయి. ఆరిఫ్ మహ్మద్ ఖాన్ ఐదు ఏళ్లకుపైగా కేరళ గవర్నర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు వేరే పదవి ఇచ్చే అవకాశం ఉంది. అండమాన్ నికోబార్ దీవుల లెఫ్టినెంట్ గవర్నర్ దేవేంద్ర కుమార్ జోషి పదవీ విరమణ చేయవచ్చు. లేదంటే కేరళ, జమ్మూ కశ్మీర్‌లకుగానూ ఆయనకు నూతన బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది.


త్వరలోనే..

కర్ణాటక గవర్నర్‌ థావర్‌ చంద్‌ గహ్లోత్, గుజరాత్‌ గవర్నర్‌ ఆచార్య దేవవ్రత్‌లు మూడేళ్లకు పైగా తమ పదవుల్లో కొనసాగుతున్నారు. జులై 15, 2021న బాధ్యతలు స్వీకరించిన గోవా గవర్నర్ PS శ్రీధరన్ పిళ్లై, జూలై 15, 2021 నుండి పదవిలో ఉన్న హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కూడా మూడేళ్లకు పైగా పదవీకాలం పూర్తి చేసుకున్నారు. అలాగే మధ్యప్రదేశ్ గవర్నర్ మంగూభాయ్ సి పటేల్ ఉత్తరాఖండ్ గవర్నర్ గుర్మిత్ సింగ్‌కు సంబంధించి 3 ఏళ్ల పదవీ కాలం పూర్తయింది. ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ ఐదేళ్లు... తమిళనాడు ఆర్‌ఎన్‌ రవి, గోవా పీఎస్‌ శ్రీధరన్‌ పిళ్లై మూడేళ్లుగా గవర్నర్ పదవిలో ఉన్నారు. మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత పునర్వ్యవస్థీకరణ జరగవచ్చని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయని సీనియర్‌ బీజేపీ నేతలను గవర్నర్‌ లేదా ఎల్‌జీలుగా నియమించే అవకాశం ఉంది. మాజీ ఎంపీలు అశ్వనీ చౌబే, వీకే సింగ్, ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ ఈ జాబితాలో ఉన్నాయి.

BJP: హరియాణా సీఎంగా నాయబ్ సింగ్ సైనీ ప్రమాణ స్వీకారం


Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Oct 17 , 2024 | 04:12 PM