ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

తొలిదశ ఎన్నికల్లో సంపన్నులు

ABN, Publish Date - Apr 16 , 2024 | 02:27 AM

సార్వత్రిక ఎన్నికల తొలిదశ పోలింగ్‌ ఈ నెల 19న జరగనుంది. మొత్తం 1,618 మంది అభ్యర్థులు తలపడుతున్నారు. వీరిలో ఐదుగురు అపర కోటీశ్వరులు కావడం గమనార్హం. 252 మందిపై(16ు) క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. మరో 161

సార్వత్రిక ఎన్నికల తొలిదశ పోలింగ్‌ ఈ నెల 19న జరగనుంది. మొత్తం 1,618 మంది అభ్యర్థులు తలపడుతున్నారు. వీరిలో ఐదుగురు అపర కోటీశ్వరులు కావడం గమనార్హం. 252 మందిపై(16ు) క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. మరో 161 మందిపై(10ు) తీవ్ర స్థాయి క్రిమినల్‌ నేరాలు నమోదయ్యాయి. ఎన్నికల సంఘానికి అభ్యర్థులు సమర్పించిన అఫిడవిట్ల ఆధారంగా అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫార్మ్స్‌(ఏడీఆర్‌) సంస్థ ఆయా వివరాలు వెల్లడించింది.

మధ్యప్రదేశ్‌లోని ఛింద్వారా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న మాజీ సీఎం కమల్‌నాథ్‌ కుమారుడు నకుల్‌ నాథ్‌ ఆస్తులు రూ.716 కోట్లు. సంపన్నుల జాబితాలో ఈయనదే తొలిస్థానం.

తమిళనాడులోని ఈరోడ్‌ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్న ఏఐఏడీఎంకే అభ్యర్థి అశోక్‌కుమార్‌ ఆస్తులు రూ.662 కోట్లు. ఈయన అత్యధిక సంపన్నుల జాబితాలో రెండో స్థానంలో ఉన్నారు.

రూ.304 కోట్ల ఆస్తులతో బీజేపీ అభ్యర్థి దేవనాథన్‌యాదవ్‌ .టి మూడోస్థానంలో ఉన్నారు. ఈయన తమిళనాడులోని శివగంగ నుంచి పోటీ చేస్తున్నారు.

ఉత్తరాఖండ్‌లోని తెహ్రీ గడ్వాల్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి మాలా రాజ్యలక్ష్మీషా రూ.206 కోట్ల ఆస్తులతో నాలుగో స్థానంలో నిలిచారు.

ఉత్తరప్రదేశ్‌లోని షహ్రన్‌పూర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న బీఎస్పీ అభ్యర్థి మాజిద్‌ అలీ రూ.159 కోట్లతో ఐదో స్థానంలో ఉన్నారు.

నేరాల చిట్టా ఇదీ..

తొలిదశలో పోటీ చేస్తున్న 1,618 మంది అభ్యర్థుల్లో 252 మందిపై క్రిమినల్‌ కేసులు ఉన్నాయి.

161 మంది అభ్యర్థులపై అతి తీవ్ర నేరాలకు సంబంధించిన కేసులు నమోదయ్యాయి.

ఏడుగురు అభ్యర్థులపై హత్య, 19 మందిపై హత్యాయత్నం కేసులు ఉన్నాయి.

18 మంది అభ్యర్థులపై మహిళలపై దాడులకు సంబంధించిన కేసులు నమోదయ్యాయి.

ఒక అభ్యర్థిపై అత్యాచారం కేసు(సెక్షన్‌ 376) నమోదైంది.

35 మంది విద్వేష ప్రసంగాలతో సమాజంలో అల్లర్లు సృష్టించిన కేసులు ఎదుర్కొంటున్నారు.

తొలిదశ ఎన్నికలు జరుగుతున్న 102 స్థానాలకు సంబంధించి 43 సీట్లలో ఎన్నికల సంఘం ‘రెడ్‌ అలర్ట్‌’ ప్రకటించింది.

- సెంట్రల్‌ డెస్క్‌

Updated Date - Apr 16 , 2024 | 06:49 AM

Advertising
Advertising