Sachin Tendulkar: అయోధ్య 'ప్రాణ్ ప్రతిష్ట'కు సచిన్
ABN, Publish Date - Jan 13 , 2024 | 04:26 PM
అయోధ్య రామాలయంలో ఈనెల 22న జరుగున్న ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి రావాల్సిందిగా భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌కు ఆహ్వానం అందింది. దేశవ్యాప్తంగా వివిధరంగాలకు చెందిన సుమారు 11,000 మంది ప్రముఖులకు టెంపుల్ ట్రస్ట్ ఆహ్వానాలు అందించింది.
ముంబై: అయోధ్య రామాలయం (Ayodhya Ram Temple)లో ఈనెల 22న జరుగున్న ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి రావాల్సిందిగా భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar)కు ఆహ్వానం అందింది. దేశవ్యాప్తంగా వివిధరంగాలకు చెందిన సుమారు 11,000 మంది ప్రముఖులకు టెంపుల్ ట్రస్ట్ ఆహ్వానాలు అందించింది. టెండూల్కర్‌తో పాటు పలువురు క్రికెటర్లకు ఇప్పటికే రామమందిర్ ప్రారంభోత్సవానికి ఆహ్వానాలు అందాయి. వీరిలో నీరజ్ చోప్రా, పీపీ సింధు, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ తదితరులు ఉన్నారు. సినీ ప్రముఖులు జాఖీ ష్రాఫ్, రజినీకాంత్, రణ్‌బీర్ కపూర్ తదితరులకు కూడా ఆహ్వానాలు అందాయి.
అయోధ్యలో ప్రాణప్రతిష్ట కార్యక్రమం సన్నాహకాలను చేస్తున్న రామ జన్మబూమి తీర్థ్ క్షేత్ర ట్రస్టు దగ్గరుండి మరీ ప్రముఖులకు ఆహ్వానాలు అందిస్తోంది. ప్రాణ ప్రతిష్ఠ రోజు అతిథులకు ప్రత్యేక 'లడ్డూ' పంపిణీకి కూడా ఏర్పాట్లు చేసింది. లక్ష మందికి పైగా భక్తులు 22న అయోధ్యకు వస్తారని టెంపుల్ ట్రస్ట్ అంచనా వేస్తోంది.
Updated Date - Jan 13 , 2024 | 04:28 PM