ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Sadhguru: సంపద సృష్టికర్తలను వివాదాల్లోకి లాగొద్దు

ABN, Publish Date - Dec 13 , 2024 | 06:04 AM

దేశంలో సంపద సృష్టించేవారిని, ఉద్యోగాలు కల్పించేవారిని రాజకీయ వివాదాల్లోకి లాగొద్దని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సద్గురు జగ్గీవాసుదేవ్‌ పేర్కొన్నారు.

  • పార్లమెంటు స్తంభనపై సద్గురు జగ్గీవాసుదేవ్‌ స్పందన

న్యూఢిల్లీ, డిసెంబరు 12: దేశంలో సంపద సృష్టించేవారిని, ఉద్యోగాలు కల్పించేవారిని రాజకీయ వివాదాల్లోకి లాగొద్దని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సద్గురు జగ్గీవాసుదేవ్‌ పేర్కొన్నారు. ఏవైనా అవకతవకలు ఉంటే చట్ట ప్రకారం చర్యలు ఉండాలని, అంతేకానీ రాజకీయంగా ఫుట్‌బాల్‌ ఆడటం సరికాదన్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త అదానీపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తూ పార్లమెంటులో ప్రతిపక్షాలు నిరసనలు కొనసాగిస్తున్న నేపథ్యంలో ‘ఎక్స్‌’ వేదికగా సద్గురు ఓ పోస్టు చేశారు.


‘ప్రపంచంలో ప్రజాస్వామ్యానికి భారత్‌ దీపస్తంభం కావాలని ఆకాంక్షిస్తున్న తరుణంలో పార్లమెంటులో కార్యకలాపాలను అడ్డుకోవడం నిరుత్సాహం కలిగిస్తోంది. మన దేశం భవ్య భారత్‌గా ఎదగాలంటే వ్యాపారాలు అభివృద్ధి చెందడం ఒక్కటే మార్గం’ అని సద్గురు పేర్కొన్నారు.

Updated Date - Dec 13 , 2024 | 06:04 AM