Salman Khan: నివాసం వద్ద కాల్పులు: నిందితుడు ఆత్మహత్య
ABN, Publish Date - May 01 , 2024 | 03:58 PM
బాలీవుడ్ ప్రముఖ నటుడు సల్మాన్‌ఖాన్ నివాసం వద్ద కాల్పులకు సంబంధించిన కేసులో నిందితుడు అంజు తపన్ ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం పోలీస్ కస్టడీలో అతడు ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించాడు. ఈ విషయాన్ని గమనించిన పోలీసులు.. అతడిని వెంటనే సెయింట్ జార్జి ఆసుపత్రికి తరలించారు. అయితే ఆతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.
ముంభై, మే 1: బాలీవుడ్ ప్రముఖ నటుడు సల్మాన్‌ఖాన్ (Salman Khan) నివాసం వద్ద కాల్పులకు సంబంధించిన కేసులో నిందితుడు అంజు తపన్ (Anuj Thapan) ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం పోలీస్ కస్టడీలో అతడు ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించాడు. ఈ విషయాన్ని గమనించిన పోలీసులు.. అతడిని వెంటనే సెయింట్ జార్జి ఆసుపత్రికి తరలించారు. అయితే ఆతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఈ మేరకు ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. ఏప్రిల్ 14వ తేదీ తెల్లవారుజామున ముంబై మహానగరం బాంద్రాలోని గెలాక్సీ ఆపార్ట్‌మెంట్ వద్ద మోటర్ బైక్‌పై హెల్మెట్‌తో వచ్చిన ఇద్దరు ఆగంతకులు నాలుగు రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ కాల్పులు జరిగిన సమయంలో సల్మాన్ ఖాన్‌తోపాటు ఆయన కుటుంబ సభ్యులు ఇంట్లోనే ఉన్నారు.
దీంతో ఈ కాల్పుల ఘటనపై వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్రైమ్ బ్రాంచ్ పోలీసులు రంగంలోకి దిగి.. సల్మాన్ నివాస ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను పరిశీలించారు. అందులోభాగంగా ఏప్రిల్ 25వ తేదీన పంజాబ్‌లో అంజు తపన్‌తోపాటు సోను సుభాష్ చందర్‌ను అరెస్ట్ చేశారు. వారిని ముంబై పోలీస్ కమిషనర్ కార్యాలయంలోని లాకప్‌కు తరలించి.. విచారించారు.
LokSabha Elections: కొన్ని గంటల్లో అమేథీ, రాయబరేలి అభ్యర్థుల ఎంపిక
దాంతో ఈ కాల్పులకు పాల్పడింది.. వికాస్ కుమార్ గుప్తాతోపాటు సాగర్ కుమార్ పాల్ అని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఆ క్రమంలో వారిని గుజరాత్‌లో అదుపులోకి తీసుకున్నారు. అయితే వీరిద్దరికి తుపాకులను అంజు తపన్ అందించినట్లు పోలీస్ విచారణతో తెలింది. అయితే వీరు సల్మాన్ నివాసం వద్ద కాల్పులు కోసం.. బిహార్‌లో ప్రాక్టీస్ చేసినట్లు పోలీసు దర్యాప్తులో వెల్లడి అయింది. మరోవైపు ఈ కాల్పుల ఘటన తమ పనేనని గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్టోయి సోదరుడు అన్మోల్ బిష్టోయ్ సోషల్ మీడియా వేదికగా గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే.
Read Latest National News And Telugu News
Updated Date - May 01 , 2024 | 04:01 PM