ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Sanjay Raut: సీట్ల కేటాయింపుపై కూటమిలో విభేదాలు లేవు

ABN, Publish Date - Jan 05 , 2024 | 05:04 PM

ఇండియా కూటమిలో సీట్ల కేటాయింపులో విభేదాలు ఏమీ లేవని శివసేన పార్టీ అంటోంది. మహారాష్ట్రలో అయితే సవ్యంగానే సాగుతుందని చెబుతుంది. మిగతా చోట్ల కూడా త్వరలో క్లారిటీ రానుందని వివరించింది.

ముంబై: ఇండియా (INDIA) కూటమిలో సీట్ల కేటాయింపులో విభేదాలు ఏమీ లేవని శివసేన (Shivasena) పార్టీ అంటోంది. మహారాష్ట్రలో అయితే సవ్యంగానే సాగుతుందని చెబుతుంది. మిగతా చోట్ల కూడా త్వరలో క్లారిటీ రానుందని వివరించింది. కూటమిలో సీట్ల కేటాయింపుపై కొద్దిరోజుల క్రితం కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హై లెవల్ కమిటీని నియమించారు. ‘కమిటీలోని సీనియర్ నేతలతో మాట్లాడానని, కొద్దిరోజుల్లో కమిటీతో సమావేశం అవుతాం. దీంతో ప్రాథమిక చర్చలు ముగుస్తాయిని’ శివసేన (యూబిటి) నేత సంజయ్ రౌత్ అన్నారు.

‘మహారాష్ట్రలో (Maharashtra) కాంగ్రెస్ (Congress), ఎన్సీపీ (NCP), శివసేన (Shivasena), వీబీఏ పార్టీలతో చర్చలు కొలిక్కి వచ్చాయి. ఇక్కడ చర్చలు సానుకూలంగా జరిగాయని.. నాలుగు పార్టీల్లో ఎక్కడ విభేదాలు రాలేవు. మొదట మాత్రం సీట్ల పంపకంపై స్పష్టత లేదని అంగీకరించారు. అందుకే లుకలుకల విషయం బయటకు పొక్కి ఉంటుందని’ సంజయ్ రౌత్ అన్నారు.

మహారాష్ట్రలో శివసేన యూబీటీ 23 చోట్ల, ఎన్సీపీ 11 సీట్లు, కాంగ్రెస్ పార్టీ 22 స్థానాల్లో బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ గురువారం నాడు ఢిల్లీలో అలయన్స్ కమిటీ, మేనిఫెస్టో కమిటీతో సమావేశం అయ్యారు. సీట్ల కేటాయింపు గురించి అలయన్స్ కమిటీ కన్వీనర్ ముకుల్ వాస్నిక్ వివరించారు. మేనిఫెస్టో రూప కల్పన జరుగుతుందని.. సీట్ల కేటాయింపు ప్రక్రియ తుది దశకు చేరిందని పేర్కొన్నారు.

Updated Date - Jan 05 , 2024 | 05:04 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising