ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AAP: 'ఆప్' పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్‌గా సంజయ్ సింగ్

ABN, Publish Date - Jul 05 , 2024 | 03:46 PM

ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్‌ ను ఆప్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్‌గా ఆ పార్టీ అధిష్ఠానం శుక్రవారంనాడు నియమించింది. 'ఆప్' సుప్రీం అరవింద్ కేజ్రీవాల్ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో జైలులో ఉన్నందున ఇప్పటికే పార్టీ బాధ్యతలను సంజయ్ సింగ్ చూసుకుంటున్నారు.

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్‌ (Sanjay Singh)ను ఆప్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్‌గా ఆ పార్టీ అధిష్ఠానం శుక్రవారంనాడు నియమించింది. 'ఆప్' సుప్రీం అరవింద్ కేజ్రీవాల్ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో జైలులో ఉన్నందున ఇప్పటికే పార్టీ బాధ్యతలను సంజయ్ సింగ్ చూసుకుంటున్నారు.


ఆమ్ ఆద్మీ పార్టీ 2012లో ఏర్పాటు కాగా, కొద్దికాలానికే ఆ పార్టీలో చేరిన సంజయ్ సింగ్ వేగంగా పార్టీలో ఎదిగారు. ముఖ్య నేతల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. 2018లో తొలిసారిగా ఆయన రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఈ ఏడాది తిరిగి రెండోసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. రాజ్యసభ సభ్యుడిగా ఆప్ లెజిస్లేటివ్ ఎజెండాను ముందుకు తీసుకు వెళ్లేందుకు ఇతర రాజకీయ పార్టీలను కలుపుకొని వెళ్లడం, సంప్రదింపుల బాధ్యతను ఆయన చూసుకుంటున్నారు. తాజాగా ఆప్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్‌గా పార్లమెంటులో పార్టీ కార్యకలాపాలను సమన్వయం చేసుకునే బాధ్యత ఆయనపై ఉంటుంది. పార్టీకి, ఇతర రాజకీయ పార్టీలు, ప్రభుత్వ అధికారులు, పార్లమెంటరీ కమిటీల మధ్య సమన్యయకర్తగా కూడా ఆయన వ్యవహరిస్తారు.

Updated Date - Jul 05 , 2024 | 03:46 PM

Advertising
Advertising