2024 Loksabha Elections: 'ఇండియా బ్లాక్' సీట్ల షేరింగ్‌పై తేల్చేసిన లాలూ ప్రసాద్
ABN, Publish Date - Jan 17 , 2024 | 03:00 PM
లోక్‌సభ ఎన్నికల్లో 'ఇండియా కూటమి' మధ్య సీట్ల పంపకాల వ్యవహారం కొలిక్కి రావడం అంత ఆషామాషీ వ్యహహారం కాదని ఆర్జేడీ సుప్రీం లాలూప్రసాద్ యాదవ్ తేల్చేశారు. దీనికి సమయం పడుతుందని చెప్పారు.
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో (Loksabha Elections) విపక్ష 'ఇండియా కూటమి' (I.N.D.I.A. bloc) మధ్య సీట్ల పంపకాల వ్యవహారం కొలిక్కి రావడం అంత ఆషామాషీ వ్యవహారం కాదని ఆర్జేడీ సుప్రీం లాలూప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) తేల్చేశారు. దీనికి సమయం పడుతుందని చెప్పారు. జేడీయూ అధ్యక్షుడు, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌తో ఆర్జేడీ తెగతెంపులు చేసుకోనుందనే వదంతులను ఆయన కొట్టిపారేశారు. బుధవారంనాడిక్కడ మీడియాతో ఆయన మాట్లాడుతూ, కూటమిగా ఏర్పడిన తర్వాత భాగస్వామ్య పార్టీల మధ్య సీట్ల పంపకం వ్యవహారం అనేది అంత త్వరగా జరిగే వ్యవహారం కాదని, అందుకు తగిన సమయం పడుతుందని చెప్పారు.
అయోధ్యకు వెళ్లడంపై..
జనవరి 22న అయోధ్య రామాలయంలో జరిగే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి తాను వెళ్లడం లేదని లాలూ ప్రసాద్ యాదవ్ తెలిపారు. ఇందుకు కారణాన్ని తెలియజేస్తూ రామాలయం ట్రస్టు సభ్యుడు చంపత్‌రాయ్‌కి లేఖ రాస్తానని చెప్పారు.
Updated Date - Jan 17 , 2024 | 03:03 PM