సీనియర్ జర్నలిస్టు మురళీధర్ రెడ్డి కన్నుమూత
ABN, Publish Date - Jun 24 , 2024 | 03:14 AM
సీనియర్ జర్నలిస్టు బి. మురళీధర్ రెడ్డి(64) కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న మురళీధర్ రెడ్డి ఢిల్లీలోని రామ్‌మనోహర్ లాల్ ఆస్పత్రిలో శనివారం రాత్రి తుది శ్వాస విడిచారు.
న్యూఢిల్లీ, జూన్ 23: సీనియర్ జర్నలిస్టు బి. మురళీధర్ రెడ్డి(64) కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న మురళీధర్ రెడ్డి ఢిల్లీలోని రామ్‌మనోహర్ లాల్ ఆస్పత్రిలో శనివారం రాత్రి తుది శ్వాస విడిచారు. ది హిందూ పత్రికకు సుదీర్ఘ కాలం పనిచేసిన మురళీధర్ రెడ్డి.. ఆ వార్తాపత్రిక పాకిస్థాన్, శ్రీలంక కరస్పాడెంట్‌గా పనిచేశారు. బాబ్రీ మసీదు విధ్వంసం వంటి ముఖ్యమైన ఘటనలను రిపోర్ట్ చేశారు. మురళీధర్ రెడ్డి ఆరోగ్యం క్షీణించడంతో నెల రోజులుగా ఆయన్ను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. రెండు వారాల క్రితం కార్డియోక్ అరె్‌స్టకు గురైన ఆయన అప్పట్నించి తుది శ్వాస విడిచే వరకు కోమాలోనే ఉన్నారు. మురళీధర్ రెడ్డికి భార్య, పీటీఐ మాజీ జర్నలిస్టు అపర్ణ శ్రీవాస్తవ, కుమారుడు మనన్ ఉన్నారు. కాగా, జర్నలిస్టు మురళీధర్ రెడ్డి మరణం బాధాకరమని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆయన కుటుంబసభ్యులకు తన సానుభూతి తెలియజేశారు.
Updated Date - Jun 24 , 2024 | 03:14 AM