ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఏం చేసిందని మహాయుతికి ఈ ఓట్ల సునామీ?

ABN, Publish Date - Nov 24 , 2024 | 04:42 AM

మహారాష్ట్రలో ఏం చేసిందని బీజేపీ సారథ్యంలోని మహాయుతి కూటమికి ఓట్ల సునామీ వచ్చిందో అర్థం కావడం లేదని శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే

ముంబై: మహారాష్ట్రలో ఏం చేసిందని బీజేపీ సారథ్యంలోని మహాయుతి కూటమికి ఓట్ల సునామీ వచ్చిందో అర్థం కావడం లేదని శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే వ్యాఖ్యానించారు. బీజేపీకి సానుకూల పవనాలు వీచాయనడం కంటే దాని గెలుపునకు సునామీయే వచ్చినట్టు ఫలితాలు చెబుతున్నాయన్నారు. అయితే ఇంత భారీ విజయం ఆ కూటమికి ఎలా దక్కిందో తెలియడం లేదని పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో మహా వికాస్‌ అఘాడీ (ఎంవీఏ)... అంచనాలను మించి ఫలితాలు సాధించడం, బీజేపీని కంగుతినిపించిన విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ నాలుగు నెలల్లో పరిస్థితులు ఇంతలా ఎలా మారిపోతాయని సందేహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రైతుల దుస్థితి, నిరుద్యోగిత వంటి సమస్యలను ఎన్‌డీఏ పరిష్కరించిందా అని ప్రశ్నించారు. కరోనా కష్టకాలంలో నాతో నిలబడి, నన్ను కుటుంబ పెద్దలా భావించి నా మాట విన్న ఇదే మహారాష్ట్ర ఇలాంటి తీర్పునిచ్చిందంటే నమ్మలేకపోతున్నానని చెప్పారు. విజయం సాధించిన మహాయుతిని అభినందిస్తూ.. ఆ కూటమి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, పథకాలను అమలు చేయాలని సూచించారు.

Updated Date - Nov 24 , 2024 | 04:42 AM