Siddharamaiah: బహిరంగ చర్చకు సిద్ధమా.. అమిత్ షాకు సీఎం సిద్ధరామయ్య సవాల్
ABN, Publish Date - Feb 11 , 2024 | 09:51 PM
‘గ్యారంటీ స్కీమ్స్’ కారణంగా రాష్ట్ర ఖజానా ఖాళీ అయ్యిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సవాల్ విసిరారు. హమీ పథకాల వల్ల రాష్ట్ర ఖజానా ఖాళీ కాలేదని తాను నిరూపించగలనని అన్నారు. ఈ విషయంపై తాను చర్చించడానికి సిద్ధమని.. అమిత్ షా తనతో బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు.
‘గ్యారంటీ స్కీమ్స్’ కారణంగా రాష్ట్ర ఖజానా ఖాళీ అయ్యిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సవాల్ విసిరారు. హమీ పథకాల వల్ల రాష్ట్ర ఖజానా ఖాళీ కాలేదని తాను నిరూపించగలనని అన్నారు. ఈ విషయంపై తాను చర్చించడానికి సిద్ధమని.. అమిత్ షా తనతో బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. కేంద్రం నుంచి రాష్ట్రాలకు వచ్చే పన్నుల ఆదాయంలో అన్యాయం జరుగుతోందని ఆయన ఉద్ఘాటించారు.
ఆదివారం ఉదయం మైసూరులోని చాముండేశ్వరి ఆలయాన్ని సందర్శించిన అమిత్ షా.. ఆ తర్వాత జాతరలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ పథకాల వల్లే రాష్ట్ర ఖజానా ఖాళీ అయ్యిందని ఆరోపించారు. ఇందుకు కౌంటర్‌గా సిద్ధరామయ్య స్పందిస్తూ.. ‘గ్యారంటీ స్కీమ్స్ కారణంగా మా రాష్ట్ర ప్రభుత్వ ఖజానా ఖాళీ అవ్వలేదని నేను నిరూపించగలను. దీనిపై అమిత్ షా నాతో బహిరంగ చర్చకు రావాలి. ఇంకా చెప్పాలంటే.. కేంద్రం నుంచి రాష్ట్రాలకు వచ్చే పన్నుల ఆదాయంలో అన్యాయం జరుగుతోంది. దీనిపై చర్చించేందుకు కూడా అమిత్ షాకు ఛాలెంజ్ చేస్తున్నా’’ అని చెప్పారు.
తమ ప్రభుత్వ హామీ పథకాలను నిరూత్సాహపరిచేందుకు బీజేపీ నేతలు సాయశక్తులా ప్రయత్నిస్తున్నారని సిద్ధరామయ్య ఆరోపించారు. మీరేమైనా కర్ణాటక ప్రజలపై ద్వేషం పెంచుకున్నారా అని ప్రశ్నించిన ఆయన.. ఒకవేళ అలా చేస్తే మాత్రం వారికి చాముండేశ్వరి దేవీ ఆశీస్సులు ఉండవని, శ్రీరాముడి అలాంటి వారిపై జాలి చూపించడమని చెప్పారు. హామీ పథకాలపై అభ్యంతరాలుంటే బీజేపీ నేతలు తక్షణమే తమ వ్యతిరేకతను స్పష్టంగా తెలియజేయాలని.. అలాగే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అన్ని హామీ పథకాలను నిలిపివేస్తామని ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ ‘గ్యారంటీ’ అనే పదంతో సహా రాష్ట్ర హామీ పథకాల్ని దొంగలించారని సీఎం ఆరోపించారు.
ఒకవైపు కర్ణాటకలో హామీ పథకాలను వ్యతిరేకిస్తూ.. మరోవైపు తాము పాలించే రాష్ట్రాల్లో అదే తరహా పథకాలను అమలు చేస్తామని బీజేపీ నేతలు హామీ ఇస్తున్నారని సీఎం సిద్ధరామయ్య ఎండగట్టారు. ఇది ఆ పార్టీ పేద వ్యతిరేక వైఖరిని ఎత్తి చూపిస్తుందని అన్నారు. బీజేపీ నేతల అసలైన వ్యతిరేకత హామీ పథకాలపై కాదని.. ఈ పథకాల లబ్ధిదారులైన పేదలని చెప్పారు. నిరుపేదల కోసం ఉద్దేశించిన కార్యక్రమాలను వ్యతిరేకించిన చరిత్ర బీజేపీ, సంఘ్ పరివార్‌ది అని సంచలన వ్యాఖ్యలు చేశారు. పేదలు సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు.. మీరు రామ నామాన్ని ఎన్నిసార్లు జపించినా వ్యర్థమేనని సీఎం సిద్ధరామయ్య సూచించారు.
Updated Date - Feb 11 , 2024 | 09:51 PM