CPI(M): సీతారాం ఏచూరి పరిస్థితి విషమం.. ఐసీయూలో చికిత్స
ABN, Publish Date - Sep 06 , 2024 | 06:24 AM
సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి పరిస్థితి విషమంగా మారింది. శ్వాస సంబంధిత సమస్యలతో ఆయన ఆగస్టు 19వ తేదీన ఎయిమ్స్‌లో చేరారు.
ఢిల్లీ: సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి పరిస్థితి విషమంగా మారింది. శ్వాస సంబంధిత సమస్యలు, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న ఆయన ఆగస్టు 19వ తేదీన ఎయిమ్స్‌లో చేరారు. అప్పటి నుంచి ఇంకా ఆయన ఎయిమ్స్‌లోనే చికిత్స పొందుతున్నారు.
రాత్రి ఎయిమ్స్‌లోని ఐసీయూకి ఆయన్ని తరలించారు. తొలుత ఆయనను ఎమర్జెన్సీ వార్డ్‌లో అడ్మిట్ చేసుకుని చికిత్స అందించారు. ఆ తర్వాత ఆయనను ఐసీయూలో చేర్చారు. ప్రస్తుతం ఆయనకు అక్కడే చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఢిల్లీ ఎయిమ్స్‌కు చెందిన సీనియర్ వైద్యుల బృందం సమీక్షిస్తోంది. ఈ విషయం గురువారం రాత్రి విశ్వసనీయంగా తెలిసింది.
ఇటీవలే కాటరాక్ట్ సర్జరీ..
సీతారాం ఏచూరి(72) చాలా రోజులుగా శ్వాస కోశ సంబంధ సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్యతోనే ఇటీవలే ఆయన్ని ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రత్యేక వైద్య బృందం ఆయనకు చికిత్స అందిస్తోంది. ప్రస్తుతానికైతే ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. కానీ.. జాతీయ మీడియా కథనాలు మాత్రం భిన్నంగా వస్తున్నాయి. సీతారాం ఏచూరికి ఇటీవలే కాటరాక్ట్ సర్జరీ(కంటిశుక్లం) అయింది. అప్పటి నుంచి పెద్దగా బయట ఎక్కడా కనిపించట్లేదు. ఎయిమ్స్‌లో చేరిన తర్వాత బుద్ధదేవ్ భట్టాచార్య స్మారక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి సీతారాం ఏచూరి హాజరుకావాలని అనుకున్నా.. అనారోగ్యం కారణంగా వెళ్లలేకపోయారు.
For Latest News click here
Updated Date - Sep 06 , 2024 | 07:01 AM