ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Yamuna River : కాలుష్య విష నురుగు కక్కుతున్న యమునా..

ABN, Publish Date - Nov 10 , 2024 | 11:59 AM

పుణ్యనదుల్లో ఒకటైన యమునా నది జలాలు అత్యంత కలుషితంగా మారాయి. పరిశ్రమల నుంచి విడుదలైన వ్యర్థాలు నదిలో కలుస్తుండడంతో విషపు నురగలు తేలియాడుతున్నాయి. 90 శాతం వ్యర్థ జలాలు, 58 శాతం వ్యర్థాలు యమునా నదిలో కలుస్తున్నాయి. శుద్ది చేయని మురుగు నీటిని కూడా మయునలోకే వదులుతున్నారు.

న్యూఢిల్లీ: గంగ (Ganga)లో మునిగితే లభించే పుణ్యం.. యమునా నదిలో (Yamuna River) మునకేసినా లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. అయితే ఇప్పుడు పొరపాటున మునకేస్తే పుణ్యం రావడం దేవుడెరుగు రోగాలబారిన పడే అవకాశం ఉందని నిపుణలు హెచ్చరిస్తున్నారు. కాలుష్య విష నురుగు (Pollution) కక్కుతున్న యమునా నదిలో.. కార్తీక మాసం స్నానాలు చేయడానికి యాత్రికులు ఆందోళన చెందారు. ఢిల్లీలోని కాళింది కుంజ్‌ ప్రాంతంలో యమునా నదిపై దట్టంగా విషపు నురుగు తేలుతూ కనిపించింది. ఇది నదిలో పెరుగుతున్న కాలుష్యం ప్రమాదకర స్థాయిని చూపుతుంది.


పుణ్యనదుల్లో ఒకటైన యమునా నది జలాలు అత్యంత కలుషితంగా మారాయి. పరిశ్రమల నుంచి విడుదలైన వ్యర్థాలు నదిలో కలుస్తుండడంతో విషపు నురగలు తేలియాడుతున్నాయి. 90 శాతం వ్యర్థ జలాలు, 58 శాతం వ్యర్థాలు యమునా నదిలో కలుస్తున్నాయి. శుద్ది చేయని మురుగు నీటిని కూడా మయునలోకే వదులుతున్నారు. మురుగు నీటిలో పాస్ఫేటు, ఆమ్లాలు ఉంటాయి. ఇవే విషపూరిత నురుగుగా ఏర్పడ్డానికి కారణమవుతుంది. ఈ కారణంగానే కొన్ని రోజులుగా యమునా నదిలో భారీగా నురగలు వస్తున్నాయి.


ఒకప్పుడు యమునలో మునక వేస్తే పుణ్యం వచ్చేది. కానీ ఆ పుణ్యం కోసం యమునలో మునకలు వేసేవారికి ఇప్పుడు అనారోగ్యం ప్రాప్తిస్తుంది. ఇప్పటికే వాయు కాలుష్యంతో కాక వికలమైన ఢిల్లీ వాసులను ఇప్పుడు నీటి కాలుష్యం భయపెడుతోంది. నదిలో కలిసిన రసాయనాలు నురగులుగా తేలుతున్నాయి. ఇక కార్తీక మాసం సందర్బంగా ఉత్తర భారత్‌లో నిర్వహించే ఛత్ పూజలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ పూజల్లో భాగంగా గంగా, యమున నదుల్లో భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తారు. ఈ క్రమంలో ఢిల్లీలోని కాళింది కుంజ్‌ ప్రాంతంలో భక్తులకు మరో మార్గం లేక విషపూరితమైన జలాల్లోనే పుణ్యస్నాణాలు ఆచరించారు. యమునా నదిలో ఛత్ పూజలకు ఢిల్లీ హైకోర్టు అనుమతి నిరాకరించినప్పటికీ అత్యధిక మహిళలు ఈ విషపు నురగల్లోనే ఛత్ పూజ సంప్రదాయాన్ని కొనసాగించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

విధ్వంసం సృష్టించి విజయోత్సవాలా..: కేటీఆర్

రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా విజయోత్సవాలు..

రక్షణ కోరుతున్న వైసీపీ సైకోలు..

లయోలా కళాశాల వద్ద ఉద్రిక్తత

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Nov 10 , 2024 | 11:59 AM