ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Assam: అసోంలో దారుణం.. బంద్‌కు పిలుపునిచ్చిన విద్యార్థి సంఘాలు

ABN, Publish Date - Aug 23 , 2024 | 03:40 PM

ఈశాన్య రాష్ట్రం అసోంలోని నాగోన్ జిల్లాలో గురువారం రాత్రి బాలికపై సామూహిక లైంగిక దాడి జరిగింది. ట్యూషన్ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా 14 ఏళ్ల బాలికపై ఈ దారుణం చోటు చేసుకుంది. రహదారిపై ఆపస్మారక స్థితిలో పడి ఉన్న బాలికను స్థానికులు గమనించి.. పోలీసులకు సమాచారం అందించారు.

గౌహతి, ఆగస్ట్ 23: పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ట్రైయినీ వైద్యురాలిపై లైంగిక దాడి ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. అలాంటి వేళ.. ఈశాన్య రాష్ట్రమైన అసోంలోని నాగోన్ జిల్లాలో గురువారం రాత్రి బాలికపై సామూహిక లైంగిక దాడి జరిగింది. ట్యూషన్ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా బాలికపై ఈ దారుణం చోటు చేసుకుంది.


రహదారిపై ఆపస్మారక స్థితిలో పడి ఉన్న బాలికను స్థానికులు గమనించి.. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. వైద్య పరీక్షల కోసం ఆమెను ధింగ్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ సంఘటనపై విద్యార్థి సంఘాలు మండిపడ్డాయి. అందుకు నిరసనగా ఆ ప్రాంతంలో శుక్రవారం బంద్‌కు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి.


మరోవైపు ఈ దారుణాన్ని అసోం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ ఖండించారు. నిందితులను పట్టుకుని చట్టానికి అప్పగిస్తామని స్పష్టం చేశారు. ఇది మానవత్వంపై జరిగిన దాడిగా ఆయన అభివర్ణించారు. ఈ తరహా ఘటనలను ఏ మాత్రం ఉపేక్షించేది లేదని పేర్కొన్నారు. ఈ ఘటన చోటు చేసుకున్న ప్రాంతాన్ని సందర్శించడంతోపాటు నిందితులను వెంటనే పట్టుకునేలా చర్యలు చేపట్టాలని డీజీపీకి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా సీఎం హిమంత్ బిశ్వ శర్మ వెల్లడించారు.


ఇక ఈ కేసులో ఇద్దరు అనుమానితులను పోలీసులు అరెస్ట్ చేసి.. విచారిస్తున్నారు. మరో వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అందుకోసం ప్రత్యేక బృందాలను పోలీసులు ఏర్పాటు చేశారు.

మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Aug 23 , 2024 | 03:42 PM

Advertising
Advertising
<