Delhi: రెండో ప్రపంచ యుద్ధ అనుభవజ్ఞుడు సుబేదార్ మృతి.. ఆయన గురించి తెలుసుకోవాల్సిన విషయాలివే
ABN, Publish Date - Apr 01 , 2024 | 07:52 PM
రెండో ప్రపంచ యుద్ధంలో సైనికులకు సలహాలు, సూచనలు చేసి మిత్రరాజ్యాల విజయానికి దోహదపడ్డ సుబేదార్ థాన్సేయా 102 ఏళ్ల వయసులో ఆదివారం కన్నుమూశారు. కొహిమా యుద్ధంలో ఆయన సూచనలు మిత్రరాజ్యాల దళాల విజయానికి దోహదపడ్డాయి.
ఢిల్లీ: రెండో ప్రపంచ యుద్ధంలో సైనికులకు సలహాలు, సూచనలు చేసి మిత్రరాజ్యాల విజయానికి దోహదపడ్డ సుబేదార్ థాన్సేయా 102 ఏళ్ల వయసులో ఆదివారం కన్నుమూశారు. కొహిమా యుద్ధంలో ఆయన సూచనలు మిత్రరాజ్యాల దళాల విజయానికి దోహదపడ్డాయి. ఆయన స్వరాష్ట్రం మిజోరం.
"సుబేదార్ రెండో ప్రపంచ యుద్ధంలో కీలకమైన ఘర్షణ అయిన కొహిమా యుద్ధంలో శౌర్య పరాక్రమ సాహసాలు అనిర్వచనీయం. జెస్సామిలో క్లిష్టమైన మోహరింపు సమయంలో 1వ అస్సాం రెజిమెంట్ వారసత్వాన్ని స్థాపించడంలో ఆయన కీలకంగా వ్యవహరించారు. సుబేదార్ థాన్సేయా దేశం పట్ల నిబద్ధతను ప్రదర్శించాడు. దీంతో భారత సైన్యంలో ఆయనకు ఎనలేని గుర్తింపు వచ్చింది. కొహిమాలో ఆయన చర్యలు బలీయమైన అసమానతలకు వ్యతిరేకంగా, మిత్రరాజ్యాల దళాలకు కీలకమైన విజయాన్ని తెచ్చిపెట్టడంలో దోహదపడ్డాయి" అని సైన్యంలోని ఓ సీనియర్ అధికారి తెలిపారు.
సుబేదార్ మృతిపట్ల భారత సైన్యం సంతాపం తెలిపింది. ఆయన జీవితాంతం దేశం కోసం పని చేశాడని, విద్యా కార్యక్రమాల్లో చురుగ్గు పాల్గొనేవాడని ఆయన బంధువులు చెప్పారు.
GST: జీఎస్టీ వసూళ్లలో చరిత్ర సృష్టించిన భారత్.. ఇది రెండో రికార్డ్
"సుబేదార్ వారసత్వం భారత సైన్యం. అస్సాం రెజిమెంట్, ఈశాన్య ప్రజలపై చెరగని ముద్ర వేశారు. శాంతి, స్వేచ్ఛ కోసం ఎంతగానో పోరాడారు. ధైర్యం, నాయకత్వం, విధి పట్ల అచంచలమైన నిబద్ధతకు ఆయన నిలువెత్తు నిదర్శనం. మన కోసం సేవ చేసిన ఆయన ధైర్యం, సంకల్పం వర్తమానం, భవిష్యత్తుకు పునాది వేశాయి. జ్ఞాపకాలు సజీవంగా ఉన్నాయి. ఆయన సాధించిన లక్ష్యాలు రాబోయే తరాలకు మార్గనిర్దేశం చేస్తాయి" అని భారత ఆర్మీ ఓ ప్రకటనలో పేర్కొంది.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated Date - Apr 01 , 2024 | 07:52 PM