ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Delhi: ఇంజినీర్ నుంచి రాజ్యసభ వరకు.. ఎంపీగా ప్రమాణం చేసిన సుధామూర్తి

ABN, Publish Date - Mar 14 , 2024 | 03:52 PM

రాజ్యసభ ఎంపీగా ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి భార్య సుధా మూర్తి గురువారం ప్రమాణం చేశారు. ఆమె భర్త నారాయణ మూర్తి సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది.

ఢిల్లీ: రాజ్యసభ ఎంపీగా ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి భార్య సుధా మూర్తి గురువారం ప్రమాణం చేశారు. ఆమె భర్త నారాయణ మూర్తి సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ ఖడ్ తన ఛాంబర్లో ఆమెతో ప్రమాణం చేయించారు. సభా నాయకుడు, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తదితరులు ఈ ఇందులో పాల్గొన్నారు. 73 ఏళ్ల వయస్సు కలిగిన సుధామూర్తి గతంలో ఇన్ఫోసిస్ ఛైర్మన్ గా పని చేశారు.

ఆమె పిల్లల కోసం అనేక పుస్తకాలు రాశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం గత శుక్రవారం రాజ్యసభకు సుధామూర్తిని నామినేట్ చేసింది. కన్నడ, ఆంగ్ల సాహిత్యంలో ఆమె అనేక రచనలు చేశారు. సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారం, పద్మశ్రీ(2006), పద్మభూషణ్(2023) అవార్డులను అందుకున్నారు.

టెల్కో కంపెనీలో పని చేసిన తొలి మహిళా ఇంజినీర్ గా సుధామూర్తికి ప్రత్యేక గుర్తింపు ఉంది. రూ.10 వేల పెట్టుబడితో ప్రారంభించిన ఎన్ఫోసిస్ కంపెనీ ప్రస్తుతం 80 బిలియన్ డాలర్ల కంపెనీగా అవతరించింది. సుధామూర్తి కుమార్తె అక్షత.. బ్రిటన్ ప్రధాని రిషి సునక్ ని వివాహం చేసుకున్నారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 14 , 2024 | 03:54 PM

Advertising
Advertising