ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రజ్వల్‌ రేవణ్ణ బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేత

ABN, Publish Date - Nov 12 , 2024 | 04:49 AM

జేడీఎస్‌ నాయకుడు, మాజీ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ దాఖలు చేసుకున్న బెయిల్‌ పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది.

బెంగళూరు, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): జేడీఎస్‌ నాయకుడు, మాజీ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ దాఖలు చేసుకున్న బెయిల్‌ పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది. అత్యాచార కేసులలో ఆయన బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్‌ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు. ప్రజ్వల్‌ తరపున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహద్గి వాదనలు వినిపించారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసినవేళ ఆరోపణలు వచ్చాయని, రాజకీయంగా కుట్ర జరిగిందని, బెయిల్‌ మంజూరు చేయాలని కోర్టుకు విన్నవించారు. కానీ, సుప్రీంకోర్టు ధర్మాసనం అంగీకరించలేదు. నిందితుడు పలుకుబడి ఉన్నవారని, విచారణ సమయంలో ప్రభావం చూపే అవకాశం ఉందని పేర్కొంటూ.. బెయిల్‌ పిటిషన్‌ను కొట్టివేసింది.

Updated Date - Nov 12 , 2024 | 04:49 AM