గృహ హింస చట్టం మతాతీతం: సుప్రీం కోర్టు
ABN, Publish Date - Sep 27 , 2024 | 04:29 AM
‘గృహ హింస చట్టం, 2005’ దేశంలోని ప్రతి మహిళకు గృహ హింస నుంచి రక్షణ కల్పిస్తుందని.. మతం, సామాజిక నేపథ్యంతో సంబంధం లేకుండా స్త్రీలందరికీ ఇది వర్తిస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
న్యూఢిల్లీ, సెప్టెంబరు 26: ‘గృహ హింస చట్టం, 2005’ దేశంలోని ప్రతి మహిళకు గృహ హింస నుంచి రక్షణ కల్పిస్తుందని.. మతం, సామాజిక నేపథ్యంతో సంబంధం లేకుండా స్త్రీలందరికీ ఇది వర్తిస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాజ్యాంగం మహిళలకు ఇచ్చిన హక్కుల రక్షణకు ఈ చట్టం ఇతోధికంగా దోహదపడుతుందని తెలిపింది. జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఎన్ కోటీశ్వర్‌సింగ్‌లతో కూడిన ధర్మాసనం గురువారం ఈ తీర్పును వెలువరించింది. తన భర్త నుంచి భరణం, పరిహారానికి సంబంధించిన కేసులో కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఒక మహిళ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది.
Updated Date - Sep 27 , 2024 | 04:29 AM